| నిర్మాత - గణేష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం - జయమత్ .సి.పరాన్జీ కథ - ఇంతియాజ్ ఆలీ సంగీతం - మణిశర్మ సినిమాతోగ్రఫీ - జయనన్ విన్సెంట్ మాటలు - త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటలు - రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, విశ్వ, రెహమాన్ ఎడిటింగ్ - యమ్.ఆర్.వర్మ ఆర్ట్ - నారాయణ రెడ్డి కొరియోగ్రఫీ - రాజు సుందరం, కళ్యాణి యాక్షన్ - టినూ వర్మ తారాగణం - పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బందా, పరేష్ రావెల్, సోనూ సూద్, ముఖేష్ రుషి, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, మేల్కోటే, ప్రగతి, భార్గవి తదితరులు... కథ హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" సినిమాకిది మక్కీకి మక్కీ కాపీ. మీరు గనక ఆ సినిమా చూసుంటే ఈ సినిమా చూడాల్సిన పనిలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇక కథ విషయానికొస్తే ముప్పై యేళ్ళ క్రితం అర్జున్ పాల్వాయ్ ( పవన్ కళ్యాణ్) వసుమతి ( కృతి కర్బందా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ఆమె కుటుంబంతో గొడవ పడతాడు. చివరికి తన ప్రేమను సఫలీకృతం చేసుకుంటాడు. ప్రస్తుతానికొస్తే యు.యస్.లో ఉండే మైకేల్ వేలాధన్ ( పవన్ కళ్యాణ్) జీవితాన్ని జాలీగా తీసుకునే మనిషి. అతను అమ్మాయిల వెంట తిరుగుతూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు. అతనికి ప్రేమ వంటికి పడదు. యమ్ బి ఎ చదివి ఒక హోటల్లో షెఫ్ గా పనిచేస్తుంటాడు. అలాంటి వేలాయుధన్ కి మీరా (త్రిష) అనే అమ్మాయి తారసపడుతుంది. అదే సమయంలో సేనాపతి (పరేష్ రావెల్) తన స్నేహితుడు అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథని వేలాయుధన్ తో చెపుతూంటాడు. అతనికే ఎందుకు చెపుతాడంటే వేలాయుధన్ అచ్చం అర్జున్ పాల్వాయ్ లా ఉంటాడు గనుక. అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథ వింటూంటే మీరాతో పరిచయం వేలాయుధన్ లో కనపడని మార్పు తెస్తుంది. ఎందుకంటే అర్జున్ పాల్వాయ్ లోనూ, మైకేల్ వేలాయుధన్ లోనూ కొన్ని కామన్ లక్షణాలుంటాయి. మీరా, వేలాయుధన్ స్నేహితులుగా విడిపోగానే మీరా ఇండియా వెళ్ళిపోతుంది. యు.యస్.లో మైకేల్ కి మిచెల్ అనే రష్యన్ అమ్మాయి పరిచయమవుతుంది. మిచెల్ సాంగత్యంలో ఉన్నా మైకేల్ మీరాను మరచిపోలేక ఇండియాకి వెళతాడు. అక్కడ మీరాకి సుధీర్ ( సోనూ సూద్ ) అనే యువ రాజకీయ నాయకుడితో సంబంధం నిశ్చయమై పెళ్ళవుతుంది. అక్కడి నుండి మైకేల్ లో మీరాని తను ప్రేమిస్తున్నానని తెలుస్తుంటుంది. ఇక్కడ మీరా పెళ్ళి సుధీర్ తో కాగానే, మైకేల్ కి అమెరికాలో తను కోరుకున్న కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. మైకేల్ ని మరచిపోలేని మీరా సుధీర్ తో చెప్పి విడిపోతుంది. ఆ తర్వాత ఏమయింది....? మిచెల్ ని మైకేల్ ఏం చేశాడు...? మైకేల్ ని మీరా కలిసిందా...? మైకేల్ చివరికి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేది మిగిలిన కథ. |
No comments:
Post a Comment