| బ్యానర్ - శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత - రాజు కథ, దర్శకత్వం - దశరథ్ సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ - విజయ్.కె.చక్రవర్తి మాటలు - అబ్బూరి రవి పాటలు - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, సత్యమూర్తి ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్ ఆర్ట్ - రవీందర్ యాక్షన్ - పీటర్ హెయిన్స్ తారాగణం - కళాతపస్వి, డాక్టర్ కె.విశ్వనాథ్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి, ప్రకాష్ రాజ్, మురళీ మోహన్, నాజర్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, బెనర్జీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణుడు, గౌతం రాజు, సమీర్, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, తులసి, ప్రగతి, ఉష తదితరులు... కథ - సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విక్కీ(ప్రభాస్) ఆస్ట్రేలియాలో ఉండే భారతీయ కుర్రాడు. తనకు నచ్చినట్లు జీవించాలన్నది అతని ఫిలాసఫీ. తన ఇష్టాన్ని ఇతరుల కోసం త్యాగం చేయటం, వేరే వాళ్ళకి నచ్చినట్లు బ్రతకటం అతనికి నచ్చని పని. ఆ ఆలోచన కరెక్ట్ కాదని అతని తండ్రి అతనికి ఎంత నచ్చచెప్పాలని చూసినా అతనికి అర్థం కాదు. అతనికి ఇండియాలో ఉండే ప్రియ (కాజల్) అనే తన స్నేహితుడి కూతురితో వివాహం చేయాలని విక్కీ తండ్రి విక్కీని ఇండియాకి పిలుస్తాడు. ముందు విక్కీ తనకు నచ్చకపోయినా తర్వాత విక్కీని ప్రేమిస్తుంది ప్రియ. ఇండియాకి వచ్చాక విక్కీ కోసం ప్రియ తన ఇష్టా ఇష్టాలను మార్చుకోవటం చూసిన విక్కీకి అది నచ్చదు. తనలాగే ఆలోచించే అమ్మాయినే తాను పెళ్ళిచేసుకుంటానని చెప్పి ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిపోతాడు. అందుకు ఎవరు బాధపడినా విక్కీ పట్టించుకోడు. ఆస్ట్రేలియాలో క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ పెట్టిన పోటీలో ఆరున్నర లక్షల మందిలో తనలాగే ఆలోచించే అమ్మాయి (తాప్సి) కూడా ఉందని తెలుసుకుని ఆమెను కలుస్తాడు. కానీ ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) "మీరిద్దరూ కలసి బ్రతకలేరు. మా పెద్దమ్మాయి పెళ్ళికి నువ్వురా. ఆ పెళ్ళికి వచ్చిన నలుగురిలో ఏ ఇద్దరు నువ్వు నచ్చావని చెప్పినా మీ ఇద్దరి పెళ్ళి చేస్తా"నని అంటాడు. ఆ పెళ్ళికి పెళ్ళి కొడుకు తరపున ప్రియ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ. |
No comments:
Post a Comment