Friday, May 20, 2011

Veera review[వీర రివ్యూ ]


బ్యానర్ : శాన్వి ప్రొడక్షన్స్
Rating :
2.25/5

డుదలయిన తేది
: ంఅయ్ 20, 2011



శ్యామ్( "కిక్"శ్యామ్) చాలా నిజాయితీ పరుడైన పోలీసాఫీసర్. ధనరాజ్ కొడుకు కాలేజీలో అమ్మాయిలను ఏడిపిస్తూంటే అతన్ని కఠినంగా శిక్షిస్తాడు శ్యామ్. అప్పుడు పొరపాటున ధనరాజ్ చేతిలో అతని కొడుకు మరణిస్తాడు. దాంతో శ్యామ్ మీద ధనరాజ్ పగబడతాడు. తన కొడుకు చనిపోయినందుకు ప్రతిగా శ్యాం కొడుకు మోక్షను కిడ్నాప్ చేయిస్తాడు ధనరాజ్. శ్యామ్ తన కొడుకుని రక్షించటానికి ఎంత ప్రయత్నించినా కాపాడుకోలేకపోతాడు. ధనరాజ్ మోక్షని చంపేస్తాడు. శతృవుల బారి నుంచి శ్యామ్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రభుత్వం దేవా(అజయ్) అనే బాడీ గార్డుని నియమిస్తుంది. కానీ దేవ స్థానంలో వీర (రవితేజ) అనే తెలివైన సాహసవంతుడు వస్తాడు. వీర మంచి మనసున్న వ్యక్తి. శతృవులకు అతనంటే సింహస్వప్నం. శ్యాం కుటుంబాన్ని వీర కాపాడుతూంటాడు. ఐక్యతో వీర కు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అసలు బాడీ గార్డ్ వీర కాదు....దేవా స్థానంలో వీరా వచ్చాడని తెలుసుకున్న శ్యామ్ అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటాడు. ఆ సమయంలో చనిపోయాడనుకున్న శ్యామ్ కొడుకు మోక్షను వీరా శ్యామ్ కుటుంబానికి చూపిస్తాడు. అప్పుడు శ్యామ్ ఏం చేశాడు...? దేవా స్థానంలో వీరా ఎందుకొచ్చాడు....? అసలు వీరా గతమేంటి....? శ్యామ్ కుటుంబానికి వీరాకీ సంబంధం ఏమిటి...? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే "వీర" సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :


విశ్లేషణ -
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాలో టేకింగ్ కి ఇచ్చిన ప్రాథాన్యత స్క్రీన్ ప్లే కి ఇచ్చివుంటే బాగుండేది. దర్శకత్వం పరంగా చూస్తే సినిమా గ్రాఫ్ పడుతూ లేస్తూ నానా అగచాట్లూ పడింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు మనస్సుకు హత్తుకునేలా ఉన్నా, ఆ సీన్ల ప్రభావం అలా నిలబడిపోయేలా, ప్రేక్షకులను సినిమాలోకి లీనమయ్యేలా చేయటంలో దర్శకుడి వైఫల్యం కనపడుతుంది.
ఉదాహరణకు శ్రీదేవి కొడుకుని చూడటానికి తాపత్రయపడే సీన్, సుబ్బరాజు కారులో వెళ్తూ తల్లీ కొడుకుల మీద బురద జల్లే సీన్. ఆ తర్వాత రవితేజ అతనికి బుద్ధి చెప్పే సీన్, రవితేజ తమ ఆస్తంతా తమ చెల్లి పేరు మీద మార్చి ఆ దస్తావేజులు పిన్నికిచ్చే సీన్ ఇలాంటి సీన్లన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి...కానీ ఆ తర్వాత వచ్చే సీన్లు వాటి ప్రభావాన్ని నిలబెట్టి ఉంటే సినిమా బాగుండేది. రవితేజను పెళ్ళి చేసుకున్న కాజల్ అగర్వాల్ ప్రేమ కలిగే వరకూ శోభనానికి అంగీకరించననటం కూడా ఫుట్టేజ్ పెంచటం కోసం తప్పితే సినిమాకి ఉపయోగ పడిందేం లేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - రవితేజ ప్రతి సినిమాలోలా తన సహజ శైలిలో ఫుల్ జోష్ తో నటించాడు. అలాగే కాజల్ అగర్వాల్, తాప్సి, శ్యామ్, శ్రీదేవి, నాజర్, రోజా ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం, వేణు మాధవ్ ల కామెడీ ఈ సినిమాలో ఎందుకనో ఆశించిన స్థాయిలో పండలేదు.వీళ్ళకంటే ఆలీ కాస్త బెటరనిపించాడు.
సంగీతం -
పాటలన్నీ ఫరవాలేదు. రీ-రికార్డింగ్ కూడా బాగానే ఉంది.

సినిమాటోగ్రఫీ -
బాగుంది.

మాటలు -
ఈ సినిమాకు అబ్బూరి రవి రచన, మరో ముగ్గురు రచనా సహకారం చేస్తే, మరి పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి ఏం చేశారో, ఏం రాశారో అర్థం కాదు. అయినా ఈ సినిమాలోని మాటలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

పాటలు -
పాటల్లో సాహిత్యం ఓ మోస్తరుగా ఉంది.

ఎడిటింగ్ - సగటు స్థాయిలోనే ఉంది. కారణం గౌతం రాజుగారు బహుశా వాళ్ళమ్మాయి పెళ్ళి పనుల్లో బిజీగా ఉండి ఉంటారు.
ఆర్ట్ -
బాగుంది.

కొరియోగ్రఫీ -
యావరేజ్ గా ఉంది.

యాక్షన్ -
ఇది మాస్ ప్రేక్షకులకు కావలసినంతగా నచ్చే స్థాయిలో ఉంది.

Sunday, May 15, 2011

రంగం రివ్యూ [rangam review]


'డిష్యుం డిష్యుం', 'ఈ' వంటి చిత్రాల కంటే ఆర్.బి.చౌదరి కుమారుడిగానే తెలుగువారికి పరిచయం ఉన్న జీవా మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 'రంగం' సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్.యస్.ఇన్ఫో టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె.వి ఆనంద్ దర్శకత్వం వహించారు. జీవా సరసన నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా నటించింది. ప్రియ బాజ్ పాయి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్ రావు తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. ఈ చిత్రానికి హారిస్ జై రాజ్ స్వరాలను సమకూర్చగా వెన్నెలకంటి సాహిత్యాన్ని అందించారు. రిచర్డ్.యం.నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా అంటోనీ ఎడిటింగ్ నిర్వహించారు. ఇప్పటికే 'కో' పేరుతొ తమిళంలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటుందో మన సమీక్షలో చూద్దాం.
కధ:
అశ్వద్ (జీవా) నేటి పత్రిక అనే దినపత్రిక కోసం పనిచేసే ఫోటో జర్నలిస్ట్. ఎప్పుడూ సంచలన వార్తలతో నేటిపత్రిక సర్కులేషన్ను పెంచుతూ ఉంటాడు. అదే క్రమంలో తన సంచలన కధనాలతో చిన్న పిల్లను పెళ్ళి చేసుకోవాలనుకున్న ప్రతిపక్ష నాయకుడు భండారాన్ని బయటపెట్టి జైలుకు పంపిస్తాడు. అలానే తనతో పాటు పనిచేస్తున్న సరో(ప్రియ బాజ్ పయి), ప్రియ(కార్తిక) లలో సరోని కాదని ప్రియను ప్రేమిస్తాడు అశ్వద్. మరో వైపు ప్రతిపక్ష లీడర్ జైలుకు వెళ్ళడంతో గెలుపు మీద ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి(ప్రకాష్ రాజ్)ని కూడా తప్పు చేసినందుకు ఒకానొక సమయంలో ప్రజల ముందు దోషిగా నిలబెడతాడు అశ్వద్. ఈ సమయంలోనే వసంత్ అనే యువలీడర్ యువరాజ్యం పార్టి పెట్టి ఎన్నికలలో నిలబడతాడు. అతను చేస్తున్న మంచిపనులకు అశ్వద్ కూడా మద్దతు ప్రకటించి మంచి కధనాలు పత్రికలో వచ్చేట్టు చూస్తాడు. ఆ విధంగా జనంలో మంచి పలికుబడి పెంచుకుంటున్న వసంత్ నిర్వహిస్తున్న మీటింగులో బాంబు పేలి 30 మంది వరుకు అతని కార్యకర్తలు చనిపోతారు. ఆ ప్రమాదంలో సరో కూడా చనిపోతుంది. ఆ విషాదాన్ని చూసి జనాలు వసంత్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారు. వసంత్ విజయం గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ తయారుచేసే పనిలో ఉన్న అశ్వద్ కు సరో ప్రమాదంలో చనిపోలేదు ఎవరో చంపేసారు అని తెలుస్తుంది. ఇక అక్కడినుండి కధ ఆసక్తి కరమైన మలుపులు తిరిగి అర్ధవంతమైన ముగింపుతో సుఖాంతమవుతుంది.
విశ్లేషణ:
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రంగం మీడియా వీరంగం. ప్రెస్ తలచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలదు, అవసరం అయితే నిలబెట్టగలదు అనే విషయాన్నీ నిరుపించడమే ప్రధాన లక్ష్యం గా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు కె వి ఆనంద్. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన ఆనంద్ తన అనుభవాలకు మంచి ఆలోచనలు జోడించి 'రంగం' సినిమాను రూపొందించాడు. కాకపోతే యువత రాజకీయాల్లోకి రావటానికి అయన నిర్దేశించిన మార్గాలు సినిమాటిక్ కోణంలో వాస్తవానికి దూరంగా ఉన్నాయి. సినిమా అనేది ఊహలలో నుండి, కల్పన నుండి పుట్టేది కాబట్టి అయన ప్రయత్నం మేచ్చుకోతగిందే. అలాగే చివరకు ఆయన కధను ముగించిన విధానం బాగుంది. కధ కధనాలు పక్కన పెడితే సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ఉన్నత విలువలతో తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. పీటర్ హెయిన్స్ పోరాటాలు, బృంద మాస్టర్ తదితరులు వేయించిన డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హారిస్ జై రాజ్ స్వరపరచిన పాటలు వినటానికి ఎంత బాగున్నాయో చూడటానికి అంతకంటే బాగున్నాయి. జీవా అశ్వద్ పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించాడు. నటనలో, డాన్సుల్లో, ఫైటుల్లో ఇజ్ కనబరిచి తనదైన శైలిలో రక్తికట్టించాడు. జోష్ తరవాత ఏమైపోయిందో అడ్రెస్ లేని కార్తీక ఈ సినిమాలో మంచి పాత్రలో నటించింది. కాకపోతే నటనలో ఇంకాస్త పరిణితి ప్రదర్శించి ఉంటే బాగుండేది. కోట శ్రీనివాస్ రావు, ప్రకాశ రాజ్ తమ పాత్రలకు అనుగుణంగా వారి సహజ ధోరణిలో నటించారు. మిగిలిన పాత్రలలో నటించిన వారు మనకు అంతగా పరిచయం లేని వారు. కానీ వసంత్ పాత్రలో నటించిన అజ్మల్ మంచి మార్కులు వేయించుకుంటాడు.
ప్లస్ పాయింట్స్:
రంగం సినిమాకు దర్శకత్వం ప్రధాన ప్లస్ పాయింట్. ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యం, జీవా నటన కూడా ప్లస్ పాయింట్సే ఈ చిత్రానికి . అలాగే హారిస్ జై రాజ్ పాటలు వాటిని చిత్రీకరించిన విధానం అదనపు ఆకర్షణ. మరీ ముఖ్యంగా 'నెమలి నడకలు .. ' పాటను చిత్రకరించిన ప్రదేశాలు కన్నుల పండవగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
రొటీన్ గా అనిపించే కధనం, కామెడీ లేక పోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్స్.

కొసమెరుపు:
రంగం వీరంగం... వీరంగంగానే ఉంది కానీ ఫార్ముల సినిమాలు, స్టార్ ఇమేజ్ కు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఎంత వరుకు నచ్చుతుందో వేచి చూడాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా చివరికి కలక్షన్లే కదా సినిమా విజయానికి ప్రాతిపదిక ...!

సీమ టపాకాయ్ రివ్యూ [seema tapakay review]


వరస విజయాలతో మంచి ఊపు మీదున్న అల్లరి నరేష్ వేసవి కానుకగా 'సీమ టపాకాయ్' సినిమాతో ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెల్ఫేర్ క్రియేషన్స్ ఫై డా. మళ్ళ విజయ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి నాగేశ్వర రెడ్డి దర్శకుడు. నరేష్ సరసన పూర్ణ హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, షాయాజీ షిండే, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరుధూరి రాజా మాటలను అందించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించాడు. నరేష్ తరహ కధ, కధనాలతో రూపొందించిన ఈ కామెడీ టపాకాయ్ ప్రేక్షకులను ఎంతవరుకు మెప్పించిందో మన సమీక్షలో చూద్దాం.
కధ:
ఇరవై వేల కోట్ల రూపాయల సంపాదన కలిగిన కోటిస్వరుడి కుమారుడు శ్రీకృష్ణ (అల్లరి నరేష్). అతను సత్య (పూర్ణ)అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు కోటిస్వరులంటే పడదు. అందుకని ఆమెను ప్రేమించడానికి తను పేద వాడినని చెప్పి తన కుటుంబం మొత్తం చేత పేద వాళ్ళలా యాక్ట్ చేపిస్తాడు. కానీ పిచ్చి శ్రీకృష్ణ కు సత్య బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియదు. ఆ బ్యాక్ గ్రౌండ్ మూలంగా అతను, అతని ఫ్యామిలీ అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. ఇక అక్కడి నుండి శ్రీకృష్ణ ఆ చిక్కులను చాకచక్యంగా ఎలా విడదీసి కధను సుఖాంతం చేసాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
అన్ని అల్లరి నరేష్ సినిమాలు లాగానే ఈ సినిమా కూడా నవ్వించడం అనే సిద్దాతంతోనే రూపొందింది. ఆ విషయం లో దర్శకుడు నాగేశ్వర రెడ్డి కొంతవరుకు విజయం సాదించినట్టే. ఒకే పాయింట్ ను ఆధారంగా చేసుకుని చేసిన ఈ సినిమా మొదట్లో బాగానే ఉందనిపించి నా చివరికి వచ్చేప్పటికి రొటీన్ గా తయారై కాస్త బోర్ కొడుతుంది. సన్నివేశాలు, పాత్రల రూపకల్పనలో స్పష్టతలోపించింది. అన్నింటికంటే భాదాకరమైన విషయం ఏమిటింటే మద్యలో ఉన్నట్టుండి సినిమా సెంటిమెంట్ వైపు తిరగి దాదాపు 15 నిమిషాలపాటు గ్లిజరిన్ వర్షం కురుస్తుంది. జయప్రకాశ్ రెడ్డి ఉన్న సన్నివేశాలు, ఈ మద్య వచ్చిన హిట్ పాటల పేరడీ ప్రేక్షకులకు కాస్త ఊరట.అల్లరి నరేష్ తన సహజ ధోరణిలో రెచ్చిపోయాడు. నటుడిగా పూర్తి విశ్వాసంతో కనపడుతున్నాడు. పొడవాటి డైలాగులను కూడా అవలీలగా చెప్పేస్తున్నాడు. కొత్త అమ్మాయి పూర్ణ బాగానే చేసింది. కాకపోతే ఆమె క్యారేక్తరైజేషన్ సరిగా లేదు. కొన్ని సన్నివేశాలలో అసిన్ ను గుర్తుకు తెస్తుంది. షాయాజీ షిండే నటన బాగుంది. నాగినీడు, యల్.బి.శ్రీరామ్ తదితరులు వారి పరిది మేర నటించారు. బ్రహ్మానందం మాటలు అప్పుడప్పుడు నవ్విస్తాయి. వందేమాతరం పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. మరుధూరి రాజా మాటలు ఓకే.

ప్లస్ పాయింట్స్:
మొదటి సగంలో కొన్ని కామెడీ సన్నివేశాలు.
అల్లరి నరేష్ నటన.
రెండు పాటలు(ఆకాశంలో ఒక తార.., కంది చేను..)

మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే రెండో సగం,
విసుగు తెప్పించే కొన్ని కామెడీ సన్నివేశాలు.

కొసమెరుపు: ఈ సీమ టపాకాయ్ లో మెరుపులు, మోతలు అనుకున్నంత లేవు అని ప్రేక్షకుల టాక్.

Saturday, May 7, 2011

100%Love Review[100%లవ్ రివ్యూ ]


సంస్థ: గీతా ఆర్ట్స్‌
నటీనటులు: నాగచైతన్య, తమన్నా, తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు.

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: సుకుమార్‌

పరిచయ చిత్రం జోష్ ప్లాప్..ఆ తర్వాత వచ్చిన ఏ మాయ చేసావే సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం సమంతకు కొట్టేసింది. దాంతో నాగచైతన్య తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరో ప్రక్క జగడం, ఆర్య 2 చిత్రాలు దర్సకుడుగా పేరు తెచ్చిపెట్టినా సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో దర్శకుడు సుకుమార్ కూడా కమర్షియల్ హిట్ కోసం కలవరిస్తూ ఈ చిత్రంపై నమ్మకం పెట్టుకున్నాడు. అలాగే తమన్నా కూడా హ్యాపీ డేస్ తర్వాత తెలుగులో ఆమె స్ట్రైయిట్ గా ఏ చిత్రమూ చేయలేదు. దాంతో రీ ఎంట్రీ క్రింద ఈ చిత్రం హిట్ వైపు ఆమె ఎదురుచూపులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వారి ఆశలు, నమ్మకాలు, ఎదురుచూపులు ఈ చిత్రం ఏ మేరకు నెరవేర్చింది..ఎవరు ఎన్ని మార్కులు స్కోర్ చేసారు అంటే...
మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే. కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ స్క్రిప్టు తయారుచేసుకుని ఈ సారి తాను కన్ఫూజ్ కాకుండా ప్రేక్షకుడ్ని కన్ఫూజ్ కాకుండా కాపాడాడు. అలాగే తన స్పెషలైజేషన్ అయిన క్యారెక్టర్ డ్రైవన్ ఫిల్మ్ గానూ మరో ప్రక్క ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆయన అభిమానులును సంతృప్తి పరిచాడు. ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ వద్ద నాగచైతన్య బరస్ట్ అయ్యి తన ప్రేమను వ్యక్తం చేసే సీన్ చాలా బాగా వచ్చింది. హీరో తాతగా చేసిన విజయ్ కుమార్ పాత్ర బాగా కథలో కలిసి క్లైమాక్స్ కు లీడ్ చేయటం చాలా బాగా వచ్చింది. ఆయన పాత్ర కథలో కీలకమవ్వటం సుకుమార్ స్క్రిప్టుపై చేసిన కసరత్తు ఫలితమే అనిపిస్తుంది. అంతేగాక హీరో పాత్ర చివరదాకా తన క్యారెక్టేరషన్ ని వదలకుండా నిలబెట్టడం కూడా బాగా నచ్చే అంశం. నటీనటుల్లో నాగచైతన్య..ఈజ్ బాగా ప్రదర్శించాడు.అయితే చైతన్య కన్నా తమన్నా డామినేట్ చేసిందని చెప్పాలి. సినిమా చూసిన తర్వాత ఆమె మీద టైటిల్ పెట్టి దటీజ్ మహాలక్ష్మి అంటే జస్టిఫై అయ్యేది అనిపిస్తుంది. మిగతా సీనియర్ ఆర్టిస్టుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. కెమెరా పనితనం రెగ్యులర్ సుకుమార్ లాగానే చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్పుగా ఉంది. దర్శకుడుగా సుకుమార్ ఈ సినిమాలో విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పాలి. పాటల విషయానికి వస్తే సుకుమార్ గత చిత్రాల ఆడియోతో పోలిస్తే వీకే అని చెప్పాలి. ముఖ్యంగా ఐటం సాంగ్ అసలు పేలలేదు. ఇక ఈ మధ్య కాలంలో రిలీజైన తీన్ మార్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకీ ఈ సినిమాకి ఓ పెద్ద పోలిక ఉంది. అది సినిమాలో హీరో తనదైన భావాలతో ఎదుటివారు ప్రపచం పట్టించుకోకుండా నెగిటివ్ షేడ్ తో ఉండటం..సినిమా చివరకి హీరోయిన్ మంచితనం,ప్రేమ గుర్తించి ఆమె రూటులోకి రావటం. ఇక ఈ సమ్మర్ లో ఈ సినిమా వేసవి సెలవుల్లో ఉన్న స్టూడెంట్స్ కు మంచి వినోదాన్ని ఇస్తుంది. ఫ్యామిలీలకు కూడా బాగా నచ్చే అవకాశం ఉంది.

Friday, April 29, 2011

Nenu na Rakshasi review[నేను నా రాక్షసి రివ్యూ ]


నేను నా రాక్షసి బ్యానర్ : శ్రీ లక్ష్మి నరసింహ ప్రోడుక్షన్స్ Rating : 2.25/5 విడుదలయిన తేది : Apr 29, 2011 నిర్మాత - నల్లమలపు శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - పూరీ జగన్నాథ్ సంగీతం - విశ్వ, రెహమాన్, అనూప్ సినిమాటోగ్రఫీ - అమోల్ రాథోడ్ పాటలు - విశ్వ, రెహమాన్, భాస్కరభట్ల రవికుమార్ ఎడిటింగ్ - శేఖర్ కొరియోగ్రఫీ - రాజు సుందరం, ఆంథోనీ తారాగణం - రానా దగ్గుపాటి, ఇలియానా .డి. క్రూజ్, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, నాగినీడు, ఆలీ, ఆహుతి ప్రసాద్, ముమైత్ ఖాన్ తదితరులు...

కథ - ఒక సమస్య ఎంత తీవ్రమైనదైనా, ఎంత చిన్నదైనా, ఆ సమస్యకి ఆత్మహత్యా పరిష్కారం...? అన్న ప్రశ్నకి సమాధానమే ఈ చిత్రకథ. ఇక కథ విషయానికొస్తే అభిమన్యు (రానా) ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అతను రైఫిల్ షూటింగ్ లో ఎక్స్ పర్ట్. మీనాక్షి (ఇలియానా) ఒక కాఫీబార్ లో పనిచేస్తూంటుంది. మీనాక్షి ఒక వెబ్ సైట్ రన్ చేస్తూంటుంది. ఆమెను చూడగానే అభిమన్యు ప్రేమిస్తాడు. ఆత్మహత్య చేసుకోదలచిన వారు ఆ వెబ్ సైట్ ను కాంటాక్ట్ చేస్తే, ఇలియానా వారి చావుని వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతుంది. సుపారీ (చంపటానికి తీసుకునే కిరాయి) తీసుకుని అమ్మాయిలను ఏడిపించే కుర్రాణ్ణి ఒకణ్ణి చంపుతాడు అభి. విక్రం (సుబ్బరాజు) అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఏడేళ్ళ కూతురుకి క్యాన్సర్. ఆమెను చమపమని ఆ కుర్రాడి తండ్రి అభిమన్యుకి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ పసిపిల్ల అభికి మంచి ఫ్రెండ్. దాంతో అభి ఆ కుర్రాడి తండ్రిని కూడా చంపేస్తాడు. కోమాలో ఉన్న అభి తల్లి కూడా చనిపోవటంతో అభి తాను కూడా చావాలనుకుంటాడు. అందుకు మీనాక్షి వెబ్ సైట్ ని కాంటాక్ట్ చేస్తాడు. కానీ పొడుచుకుని చనిపోయే సమయంలో తన చావుని విడియో తీస్తుంది తను ప్రేమించిన అమ్మాయేనని తెలుసుకుని బ్రతకాలనుకుంటాడు అభి. అభి చంపిన ఆ తండ్రి పెద్ద కొడుకు జైలు నుండి బయటకొస్తాడు. అతనే అభి తల్లిదండ్రుల చావుకి కారకుడు. అతను అభిని చంపటానికి ప్రయత్నిస్తుంటాడు. ఆత్మహత్యల వెబ్ సైట్ నడుపుతున్న మీనాక్షిని చివరికి పోలీసులు ట్రేస్ చేస్తారు. అప్పుడు అభి, మీనాక్షి కలసి వెనిస్ వెళ్తారు. తనను గాఢంగా ప్రేస్తున్నానన్న అభితో తాను కూడా ఓ పదిహేను రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటానంటుంది మీనాక్షి. ఆ తర్వాత ఏమయింది అన్నది మిగిలిన కథ.

ఎనాలసిస్ : ఈ సినిమా భయంకరమైన డ్రై సబ్జెక్ట్. ముందు ఇలాంటి కథతో సినిమా తీయాలనుకున్న దర్శక, నిర్మాతలకు హేట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే హీరో, హీరోయిన్లు ఇద్దరికీ డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ వల్ల సూయిసైడల్ టెండెన్సీ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి కథలను మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో తెలియదు. విభిన్నమైన కథలతో సినిమాలు రావాలి అంటూ గోలపెట్టే వారికి ఈ సినిమాలో విభిన్నత గోచరిస్తుంది. కానీ ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ ని క్యారీ చేయటంలో దర్శకుడి అసమర్థత మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పూరీ జగన్నాథ్ ( మైండ్ యూ పీప్యుల్ ఈ సినిమా వరకూ మాత్రమే నేను దర్శకుడు అసమర్థుడన్నది) దర్శకుడిగా టెకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ కథలోని సోల్ ఎక్కడో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక నటన విషయానికొస్తే... హీరోగా రానా తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. అతను డ్యాన్స్ లో కాస్త వెనకపడ్డట్టనిపించాడు. కానీ దాన్ని దర్శకుడు పూరీ చాలా జాగ్రత్తగా కవర్ చేశాడు. చక్కని ధవళ గాత్రంతో రానా డైలాగ్స్ చెప్పినా, భాష విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఇలియానా నటనలో మమచి కసి కనిపించింది. కానీ ఆమె పాత్రలో పరిపక్వత లేకపోవటం వలన ఆమె నటనకు రావలసిన గుర్తింపు రాదేమోననిపిస్తుంది. కమెడియన్ గా ఆలీకి వంక పెట్టేదెవరు....? ముమైత్ ఖాన్ ఈ చిత్రంలో మామూలుగా తను నటించే పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించటం విశేషం. అభిమన్యు సింగ్ కన్నా బాగా నటించే నటులు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మందే ఉంటారు. కాని వెతికే ఓపిక మన వాళ్ళకి ఎక్కడిది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.

సంగీతం -ఈ చిత్రంలో అద్భుతం అనిపించక పోయినా వినటానికి పాటలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ -జిగ్ జాగ్ షాట్లతో కళ్ళకి శ్రమ కలిగించకుండా ఉండి బాగుంది.

మాటలు - పూరీ జగన్నాథ్ మాటల్లో అక్కడక్కడ "పోకిరి" పోలికలు కనిపించినా, ఆ స్థాయిలో ఈ చిత్రంలోని డైలాగులు లేవనే చెప్పాలి. పాటలు -
ఈ సినిమాలోని పాటల్లో సాహిత్యం బాగానే ఉంది. ఒక పాటలో "బంగారానికి బంధువా-నా దాహం తీర్చే బిందువా" వంటి ప్రయోగాలు సాహిత్య పరంగా బాగున్నాయి.
ఎడిటింగ్ -బాగుంది. ఆర్ట్ -ఒ.కె. కొరియోగ్రఫీ - సగటు స్థాయిలో ఉంది.
యాక్షన్ - ముగ్గురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేశారు కాబట్టి ఈ సినిమాలోని ఫైట్స్ బాగుండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కదా.
Gunturwala ప్రోస్పెక్టివ్: వెరైటీ సినిమా కావాలీ....వెరైటీ సినిమా కావాలీ...... అని గుండెలు బాదుకునే వాళ్ళ కోసమే తీసిన వెరైటీ సినిమా ఇది. మీకు గనక అలాంటి వెరైటీ సినిమా చూడాలనిపిస్తే ఈ సినిమా నిరభ్యంతరంగా చూడండి.

Tuesday, April 26, 2011

mr.perfect review [MR. పర్ఫెక్ట్ రివ్యూ ]

మిస్టర్ పెర్ఫెక్ట్

బ్యానర్ : .
Rating : 3.00/5
విడుదలయిన తేది : Apr 21, 2011

బ్యానర్ - శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత - రాజు

కథ, దర్శకత్వం - దశరథ్

సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ - విజయ్.కె.చక్రవర్తి

మాటలు - అబ్బూరి రవి

పాటలు - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, సత్యమూర్తి

ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్

ఆర్ట్ - రవీందర్

యాక్షన్ - పీటర్ హెయిన్స్

తారాగణం - కళాతపస్వి, డాక్టర్ కె.విశ్వనాథ్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి, ప్రకాష్ రాజ్, మురళీ మోహన్, నాజర్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, బెనర్జీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణుడు, గౌతం రాజు, సమీర్, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, తులసి, ప్రగతి, ఉష తదితరులు...

కథ -

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విక్కీ(ప్రభాస్) ఆస్ట్రేలియాలో ఉండే భారతీయ కుర్రాడు. తనకు నచ్చినట్లు జీవించాలన్నది అతని ఫిలాసఫీ. తన ఇష్టాన్ని ఇతరుల కోసం త్యాగం చేయటం, వేరే వాళ్ళకి నచ్చినట్లు బ్రతకటం అతనికి నచ్చని పని. ఆ ఆలోచన కరెక్ట్ కాదని అతని తండ్రి అతనికి ఎంత నచ్చచెప్పాలని చూసినా అతనికి అర్థం కాదు. అతనికి ఇండియాలో ఉండే ప్రియ (కాజల్) అనే తన స్నేహితుడి కూతురితో వివాహం చేయాలని విక్కీ తండ్రి విక్కీని ఇండియాకి పిలుస్తాడు. ముందు విక్కీ తనకు నచ్చకపోయినా తర్వాత విక్కీని ప్రేమిస్తుంది ప్రియ. ఇండియాకి వచ్చాక విక్కీ కోసం ప్రియ తన ఇష్టా ఇష్టాలను మార్చుకోవటం చూసిన విక్కీకి అది నచ్చదు. తనలాగే ఆలోచించే అమ్మాయినే తాను పెళ్ళిచేసుకుంటానని చెప్పి ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిపోతాడు. అందుకు ఎవరు బాధపడినా విక్కీ పట్టించుకోడు.

ఆస్ట్రేలియాలో క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ పెట్టిన పోటీలో ఆరున్నర లక్షల మందిలో తనలాగే ఆలోచించే అమ్మాయి (తాప్సి) కూడా ఉందని తెలుసుకుని ఆమెను కలుస్తాడు. కానీ ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) "మీరిద్దరూ కలసి బ్రతకలేరు. మా పెద్దమ్మాయి పెళ్ళికి నువ్వురా. ఆ పెళ్ళికి వచ్చిన నలుగురిలో ఏ ఇద్దరు నువ్వు నచ్చావని చెప్పినా మీ ఇద్దరి పెళ్ళి చేస్తా"నని అంటాడు. ఆ పెళ్ళికి పెళ్ళి కొడుకు తరపున ప్రియ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక విధంగా చెప్పాలంటే దిల్ రాజు తను తీసిన "బొమ్మరిల్లు", "బృందావనం" రెండు సినిమాలను కలిపి ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్"గా తీశాడని చెప్పవచ్చు. ఒక విధంగా దర్శకుడు దశరథ్ పై రెండు చిత్రాలకు తోడు తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ "సంతోషం" చిత్రం ఫ్లేవర్ ని కూడా కలిపాడు. ఆ విధంగా ఈ చిత్రాన్ని యూత్ కీ, ఫ్యామిలీ ఆడియన్స్ కీ నచ్చే విధంగా ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని తీశాడు. చాలా రోజులుగా హిట్ లేని కసిని ఈ చిత్రం తీయటంలో చూపించాడు దశరథ్. ఆ విధంగా ఒక హిట్ చిత్రాన్ని సొంతం చేసుకున్నాడు దశరథ్.

నటన - ప్రభాస్ తన నటనకు ఈ చిత్రంలో మరింత పదును పెట్టాడు. డైలాగ్ మాడ్యులేషన్ లో పరిణితి కనపడింది. హావభావాలు ప్రకటించటంలో కూడా అతనిలో మెరుగుదనం కనపడింది. మానసికంగా విక్కీ పాత్ర పడే యాతన, ఆ ఘర్షణ ప్రభాస్ చాలా బాగా చూపించాడు. ఇక యాక్షన్ సీన్లలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదుగా. మొత్తంగా ప్రభాస్ ఒక మంచి నటుడిగా రూపాంతరం చెందుతున్నాడు. కాజల్, తాప్సిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం కామెడీ కాస్త పండింది. మిగిలిన చాలా మంది నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో "చలి చలి" పాట ట్యూన్ ని సిగ్నేచర్ ట్యూన్ గా అవసరమైనప్పుడల్లా సినిమాలో వాడటం బాగుంది. అలాగే "రాయుడు గారబ్బాయి", "ఆకాశం బద్దలైన", "బావా ఎప్పుడువచ్చితివి" పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. రీ-రికార్డింగా చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ - ఈ సినిమాకి మంచి ప్లస్ కెమెరా వర్క్. స్విమ్మింగ్ పూల్లో షూట్ చేసిన ఫైట్ లో కేమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే పాటల్లో కానీ, సినిమా అంతా కానీ, చాలా నీట్ గా చూపించటంలో కెమెరా వర్క్ బాగుంది.

మాటలు - ఈ సినిమాకి హైలైట్ అబ్బూరి రవి మాటలు. ఈ సినిమాలోని మాటలు సింపుల్ గా ఉండి, అర్థవంతంగా మనల్నిఆలోచింపచేసేవిగా ఉన్నాయి. అలాగే "బొమ్మరిల్లు" చిత్రంలోలా కొన్ని సందర్భాల్లో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి ఈ చిత్రంలోని సంభాషణలు. హేట్సాఫ్ టు హిమ్.

పాటలు - ఈ చిత్రంలోని పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. కాకపోతే తెలుగు పాటల్లో ఆంగ్ల పదాల ప్రయోగమే ఆధునికత (స్టైల్) అనుకునే దౌర్భాగ్యం నుంచి మన పాటల రచయితలు ఎన్నటికి బయటపడతారో పాపం.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - చాలా బాగుంది. రవీందర్ తో చాలా పెద్ద తలకాయనొప్పి ఎంటంటే సినిమాలో ఏది సెట్టో ఏది ఒరిజనలో అతను మనకి చెపితే కానీ అర్థం కాదు.
కొరియోగ్రఫీ - ఉన్నంతలో అన్ని పాటల్లోనూ బాగుందనే చెప్పాలి.
యాక్షన్ - ఈ సినిమాలో ఉన్న మూడు ఫైట్లూ బాగున్నాయి.


తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఇది ఆహో ఓహో అనేంత గొప్ప సినిమా కాకపోయినా, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని కచ్చితంగా చెప్పాలి. అదీగాక ఈ సినిమాలో అశ్లీలత, అసభ్యతలకు తావులేకుండా తీస్తూ, మానవ సంబంధాలకు పెద్దపీట వేయటం వలన సకుటుంబంగా ఈ సినిమాని చూడవచ్చు.

Thursday, April 14, 2011

teen maar review[తీన్ మార్ రివ్యూ]


బ్యానర్ : పరమేశ్వర ఆర్ట్స్
Rating : 3.00/5
విడుదలయిన తేది : Apr 14, 2011



నిర్మాత - గణేష్ స్క్రీన్ ప్లే,

దర్శకత్వం - జయమత్ .సి.పరాన్జీ

కథ - ఇంతియాజ్ ఆలీ

సంగీతం - మణిశర్మ

సినిమాతోగ్రఫీ - జయనన్ విన్సెంట్

మాటలు - త్రివిక్రమ్ శ్రీనివాస్

పాటలు - రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, విశ్వ, రెహమాన్

ఎడిటింగ్ - యమ్.ఆర్.వర్మ

ఆర్ట్ - నారాయణ రెడ్డి

కొరియోగ్రఫీ - రాజు సుందరం, కళ్యాణి

యాక్షన్ - టినూ వర్మ

తారాగణం - పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బందా, పరేష్ రావెల్, సోనూ సూద్, ముఖేష్ రుషి, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, మేల్కోటే, ప్రగతి, భార్గవి తదితరులు...

కథ

హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" సినిమాకిది మక్కీకి మక్కీ కాపీ. మీరు గనక ఆ సినిమా చూసుంటే ఈ సినిమా చూడాల్సిన పనిలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇక కథ విషయానికొస్తే ముప్పై యేళ్ళ క్రితం అర్జున్ పాల్వాయ్ ( పవన్ కళ్యాణ్) వసుమతి ( కృతి కర్బందా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ఆమె కుటుంబంతో గొడవ పడతాడు. చివరికి తన ప్రేమను సఫలీకృతం చేసుకుంటాడు. ప్రస్తుతానికొస్తే యు.యస్.లో ఉండే మైకేల్ వేలాధన్ ( పవన్ కళ్యాణ్) జీవితాన్ని జాలీగా తీసుకునే మనిషి. అతను అమ్మాయిల వెంట తిరుగుతూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు.

అతనికి ప్రేమ వంటికి పడదు. యమ్ బి ఎ చదివి ఒక హోటల్లో షెఫ్ గా పనిచేస్తుంటాడు. అలాంటి వేలాయుధన్ కి మీరా (త్రిష) అనే అమ్మాయి తారసపడుతుంది. అదే సమయంలో సేనాపతి (పరేష్ రావెల్) తన స్నేహితుడు అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథని వేలాయుధన్ తో చెపుతూంటాడు. అతనికే ఎందుకు చెపుతాడంటే వేలాయుధన్ అచ్చం అర్జున్ పాల్వాయ్ లా ఉంటాడు గనుక. అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథ వింటూంటే మీరాతో పరిచయం వేలాయుధన్ లో కనపడని మార్పు తెస్తుంది. ఎందుకంటే అర్జున్ పాల్వాయ్ లోనూ, మైకేల్ వేలాయుధన్ లోనూ కొన్ని కామన్ లక్షణాలుంటాయి. మీరా, వేలాయుధన్ స్నేహితులుగా విడిపోగానే మీరా ఇండియా వెళ్ళిపోతుంది. యు.యస్.లో మైకేల్ కి మిచెల్ అనే రష్యన్ అమ్మాయి పరిచయమవుతుంది. మిచెల్ సాంగత్యంలో ఉన్నా మైకేల్ మీరాను మరచిపోలేక ఇండియాకి వెళతాడు.

అక్కడ మీరాకి సుధీర్ ( సోనూ సూద్ ) అనే యువ రాజకీయ నాయకుడితో సంబంధం నిశ్చయమై పెళ్ళవుతుంది. అక్కడి నుండి మైకేల్ లో మీరాని తను ప్రేమిస్తున్నానని తెలుస్తుంటుంది. ఇక్కడ మీరా పెళ్ళి సుధీర్ తో కాగానే, మైకేల్ కి అమెరికాలో తను కోరుకున్న కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. మైకేల్ ని మరచిపోలేని మీరా సుధీర్ తో చెప్పి విడిపోతుంది. ఆ తర్వాత ఏమయింది....? మిచెల్ ని మైకేల్ ఏం చేశాడు...? మైకేల్ ని మీరా కలిసిందా...? మైకేల్ చివరికి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

చాలా జాగ్రత్తగా హిందీ సినిమాని చిన్న చిన్న మార్పులతో అలాగే తీశారు. దర్శకుడు జయంత్ ఈ సినిమా కోసం కొత్తగా చేసిందేం లేదు. హింది సినిమాని ఫాలో అవటమే జయంత్ చేసింది. ఇక అర్జున్ పాల్వాయ్ గా, మైకేల్ వేలాయుధన్ గా పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ రెండు పాత్రల్లోనూ వీలయినంత వైరుధ్యాన్ని పవన్ కళ్యాణ్ చూపించారనే చెప్పాలి. ఒక క్రమబద్ధమైన నీతివంతమైన జీవితాన్ని అర్జున్ పాల్వాయ్ గడిపితే, ఏ నీతీ లేకుండా జీవితాన్ని ఆస్వాదించటమే లక్ష్యంగా బ్రతికే నేటి కొంతమంది యువకులకు ప్రతినిధిగా మైకేల్ వేలాయుధన్ పాత్ర ఉంటుంది.

మళ్ళీ పాత చిత్రాల్లో అంటే "ఖుషి", "బద్రి" వంటి చిత్రాల్లోలా ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ నటనలో ఎనర్జీ, ఉత్సాహం కనబడటం అభిమానులకు ఆనందం కలిగించే విషయం. ఇక హీరోయిన్ త్రిష ముఖంలో ముడతలు స్పష్టంగా కనపడుతున్నాయి. త్రిష ముఖంలో కళ తప్పింది. కానీ ఆమె నటనలో మాత్రం పరిణితి కనిపించింది. కృతి కర్బందా మేకప్ కాస్త తగ్గిస్తే బాగుండేదనిపించింది. ఆమె నటన కూడా ఫరవాలేదు. ఇక పరేష్ రామెల్, సోనూ సూద్, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, ముఖేష్ రుషి, మేల్కోటే వంటి నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - గొప్పగా లేకపోయినా కొన్ని పాటలు వినటానికి బాగున్నాయి.

రీ-రికార్డింగ్ బాగుంది.

సినిమాటోగ్రఫీ - బాగుంది. కొన్ని ఫ్రేములు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. పాటల్లో, యాక్షన్ సీన్లలో కేమెరా వర్క్ బాగుంది.

మాటలు - చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రాండ్ ఈ చిత్రంలో స్పష్టంగా కనపడుతుంది. మాటల్లో ట్రికిష్ లాజిక్ మనల్ని బాగా ఆలోచింపజేస్తూ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో డైలాగుల్లో. పాటలు - సాహిత్య పరంగా అన్ని పాటలూ బాగున్నాయనే చెప్పాలి. కాశీలో శివుడి పాట, "ఆలె ఆలె ఆలె ఆలె" పాట సాహిత్య పరంగా ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంటాయి.

ఎడిటింగ్ - యమ్ ఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది.

ఆర్ట్ - ఈ చిత్రంలో ఆర్ట్ పనితనం చాలా బాగుంది. ముప్పయ్యేళ్ళ క్రితం భారత దేశానికి, ఇప్పటి భారత దేశానికి ఉన్న తేడాని ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి చాలా చక్కగా చూపించారు.

కొరియోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా "ఆలె ఆలె ఆలె ఆలె" పాటలో కొరియోగ్రఫీ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉండి బాగుంది.

యాక్షన్ - ఈ సినిమాలో మామూలుగా హీరో తంతే విలన్లు వందగజాల దూరం గాల్లోకి ఎగిరిపోవటం వంటివి లేకుండా టిను వర్మ యాక్షన్ కంపోజింగ్ సహజంగా ఉండి ఆకట్టుకునే ఉంది.


తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఈ సినిమా నానాటికీ నేటి యువతరంలో తరిగిపోతున్న మానవ విలువల గురించి, జీవితం గురించి నేటి యువత ఆలోచనా విధానాన్ని చక్కగా కళ్ళముందుంచుతుంది. హిందీ సినిమా "లవ్ ఆజ్ కల్ " సినిమా కనక మీరు చూడకపోతే, పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ నటన కోసం ఈ సినిమా హ్యాపీగా చూడండి.

Monday, April 11, 2011

వస్తాడు నా రాజు రివ్యూ [vastadu na raju review]


'డీ' సినిమా సూపర్ హిట్ తరవాత సరైన హిట్ రాకపోవడం పక్కనుంచి సలీం వంటి సినిమాతో విసుగేత్తిపోయిన విష్ణు కసితో తనను తాను నిరుపించుకోవటానికి 'వస్తాడు నా రాజు' సినిమాను నిర్మించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పద్మశ్రీ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై విష్ణు తోలిసారి నిర్మిస్తున్న ఈ చిత్రంతో హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాప్సీ విష్ణుతో జోడి కట్టిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ కెమెరామెన్ యస్.గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా గౌతమ్ రాజు ఎడిటింగ్ నిర్వహించారు. తొలిసారి మణిశర్మ విష్ణు సినిమాకు సంగీతాన్ని సమకూర్చగా వెన్నెలకంటి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, విశ్వ సాహిత్యాన్ని అందించారు. షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏవిధమైన ప్రచారం లేకపోయినా, లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించి ఆఫై విజయవాడలో ఆడియో రిలీజ్ ఘనంగా నిర్వహించి బాలీవుడ్ తరహాలో కావలిసినంత ప్రచారాన్ని కూడబెట్టుకున్నాడు విష్ణు. సలీమ్ సినిమా చేదు అనుభావలనుండి నేర్చుకున్న గుణపాఠాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను 2.30 గంటలు నవ్విస్తుంది అని భరోసా ఇచ్చిన విష్ణు నమ్మకాన్ని 'వస్తాడు నా రాజు' ఎంతవరుకు నిలబెట్టిందో ఈ సమీక్షలో చూద్దాం.
కధ: హోం మినిస్టర్(షాయాజీ షిండే) దగ్గర నమ్మిన బంటులా పనిచేస్తున్న నరసింహ(ప్రకాష్ రాజ్) కు ఎమ్.యల్.ఎ కావాలని ఆశ. దానికి మొదట్లో హోం మినిస్టర్ ఒప్పుకోకపోయినా ఆయన కొడుకు అజయ్(అజయ్) నరసింహచెల్లెలు పూజ(తాప్సీ) ను పెళ్ళిచేసుకుంటా లేదంటే చస్తా అనటంతో మెత్తపడ్డ హోం మినిస్టర్ నరసింహను ఎమ్.యల్.ఎ చేయటానికి ఒప్పుకుంటాడు. పూజ తన కలలరాజు కోసం కలలు కంటూ ఉంటుంది. అలాగే ప్రేమంటే మంచి ఒపీనియన్ లేని వెంకటప్పనాయుడు అలియాస్ వెంకి కిక్ బాక్సర్ కావాలి అనే ధ్యేయంతో ఉంటాడు. హోం మినిస్టర్ కొడుక్కు తన చెల్లెలను ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్న నరసింహకు కొన్ని అనుకోని పరిస్థితుల్లో వెంకీ, పూజల మద్య ప్రేమ ఉంది అని అనుమానం కలుగుతుంది. కానీ వారి మద్య ఎటువంటి సంబందము ఉండదు. అపోహలు నిజమని నమ్మిన నరసింహ వెంకి జీవితంలో కష్టాలు కలిగిస్తాడు చివరికి అతన్ని చంపటానికి ప్రయత్నిస్తాడు. ఎదురు తిరిగిన వెంకి పూజను కిడ్నాప్ చేసి తన కష్టాలన్నీ తీరుస్తేనే పూజను వదిలిపెడతా అంటాడు. ఆతరవాత దగ్గరగా ఉన్న వెంకి, పూజల మద్య ప్రేమ పుడుతుంది. వెంకి ప్రోబ్లమ్స్ తీర్చేసిన నరసింహకు వారిద్దరిమద్య ప్రేమ లేదని తెలుస్తుంది. దాంతో హోం మినిస్టర్ కొడుకుతో పెళ్ళికి సిద్డంచేస్తాడు. ఆ తరవాత వెంకి, పూజల ప్రేమ కధ ఎలా సుఖంతమవుతుందో అందరు ఊహించవచ్చు.

విశ్లేషణ: తెలుగు సినిమాకు మూస దర్శకుల బెడద ఇప్పుడప్పుడే వదిలేట్టు లేదు. పేరుకు కొత్త దర్శకులేకాని పరమ రొటీన్ కధ కధనాలతో ప్రేక్షకులను విసుగేత్తిస్తున్నారు. వీళ్ళు సృజనాత్మకతతో కాకుండా ఫార్ములాలతో లెక్కలేసుకుని సినిమాలు చేస్తున్న వ్యాపారవేత్తలుల ఉన్నారు. దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకుడిగా నూటికి నూరుశాతం ఫెయిల్ అయ్యాడు. ఏ విభాగం మీద అతనికి పట్టు ఉన్నట్టు అనిపించదు. రొటీన్ కధ కు మూస కధనాన్ని జోడించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. మరుధూరి రాజ గారి మాటల్లో కూడా పదును లేదు, చాలా సన్నివేశాలు సరైన గ్రిప్పింగ్ డైలాగులు లేక తేలిపోయాయి. మణిశర్మ పాటలు ఏ మాత్రం ప్రేక్షకులను దియేటర్లో కుర్చోపెట్టలేవు. ఆయన బ్యాక్ స్కోరు కూడా ఆకట్టుకునేట్టులేదు లేదు. సినిమా సాంకేతిక పరంగా పర్వాలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా అంత డిజిటల్ లో రూపొందించటం విశేషం. రెడ్ కెమెరాను ఉపయోగించి చేసిన చిత్రీకరణ బాగుంది. గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో ఫైటులు కానీ, పాటలుకానీ పెద్దగా ఆకట్టుకునేట్టు లేవు. హీరోగా కంటే నిర్మాతగానే విష్ణు ఎక్కువ కష్టపడ్డట్టు కనిపిస్తుంది. నటుడిగా విష్ణు మోహన్ బాబు వారసత్వాన్ని జిరాక్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అలాకాకుండా 'డీ' సినిమాలోల తన సొంత ఐడెన్టిటి నీ ఫాలో అయితే బాగుండేది. తాప్సీ పరవాలేదనిపించినా, ఈవిడ కూడా మరో నటన రాని బంగారు బాతే. ప్రకాష్ రాజ్ తనకు కొట్టిన పిండి అయిన పాత్రలో మరోసారి తన పని తానూ చేసుకుపోయాడు. షాయాజీ షిండే, తనికెళ్ళ భరణి తదితరులు తమ పరిదిమేర బాగానే నటించారు. హోం మిస్టర్ భార్య మాజీ ప్రియుడు రాజేష్ గా బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
లస్ పాయింట్స్:
పూర్తిగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సినిమా అన్నదే 'వస్తాడు నా రాజు' సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కధ, బోరింగ్ కధనం, నవ్వురాని హాస్యం, పసలేని మాటలు, ఫీల్ లేని ప్రేమ ఇలా అన్ని కలుపుకుని 'వస్తాడు నా రాజు' లో మైనస్లు చాలానే ఉన్నాయి.
కొసమెరుపు: సలీం సినిమా 'నాకు సినిమా ఎలా తియ్యకుడదో నేర్పింది' అని అన్న విష్ణు కు 'వస్తాడు నా రాజు' చూసిన తరవాత నువ్వు నేర్చుకోవలసింది ఇంక చాలా ఉంది అని విమర్శకులు చెబుతున్నారు.

golkonda high school review [గోల్కొండ హై స్కూల్ రివ్యూ ]


వరస పరాజయాలతో సతమతమైన సుమంత్ 'బోణి' తరవాత కొంత గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డు విన్నర్ ఇంద్రగంటి మోహన కృష్ణ తో జతకట్టి క్రికెట్ నేపద్యంలో రూపొందించిన 'గోల్కొండ హై స్కూల్ ' తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈ వారం ప్రేక్షకులముందుకు వచ్చాడు. డి. సురేష్ బాబు సమర్పణలో ఆర్ట్ బీట్ క్యాపిటల్ బ్యానర్ ఫై రామ్ మోహన్.పి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'అష్టా చమ్మ'తో దర్శకుడిగా విజయం సాదించిన మోహన కృష్ణ ఆ సినిమాలో నటించిన కలర్స్ స్వాతినే ఈ సినిమాలోను హీరోయిన్ గా తీసుకున్నారు. హరి మోహన్ పరువు రచించిన 'ది మెన్ వితిన్' నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, షఫీ తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించగా కళ్యాణి మాలిక్ సంగీతాన్ని సమకూర్చారు. భారత దేశ క్రేజీ క్రీడ క్రికెట్ నేపద్యంలో రూపొందించిన ఈ సినిమా తన జీవితంలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది అని సుమంత్ అంటే, నాకు నేషనల్ అవార్డు ఖాయం అని కళ్యాణి మాలిక్ ఇచ్చిన స్టేట్మెంట్ తో మీడియా దృష్టిని ఆకర్షించిన గోల్కొండ హైస్కూల్ ప్రేక్షకులను ఆలరించడంలో ఎంతవరుకు విజయం సాదించిందో ఈ సమీక్షలో పరిశీలిద్దాం.

కధ:

గోల్కొండ హైస్కూల్ కు కార్పోరేట్ హంగులు అద్ది హైటెక్ కోచింగ్ సెంటర్ గా తీర్చిదిద్దాలి అనే ప్రపోజల్ తో వస్తాడు ఆ స్కూల్ కు ట్రస్టీగా ఉన్న కిరీటి (సుబ్బరాజు). దాని కోసం ఎందుకూ పనికిరాకుండా ఉన్న స్కూల్ గ్రౌండ్ లో కోచింగ్ కాంప్లెక్స్ కట్టాలి అని పట్టు పడతాడు. పిల్లలకు చదువెంతో ఆటలూ అంతే అని ఆలోచించిన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ విపత్తును ఆపటానికి స్కూల్ లో క్రికెట్ కోచ్ గా ఒకప్పటి పాత విద్యార్ధి సంపత్(సుమంత్) ను రప్పిస్తాడు. మంచి క్రికెట్ ప్లేయర్ అయిన సంపత్ గ్రౌండ్ ను కాపాడే క్రమంలో కిరీటి తో ఇప్పుడున్న టీంను ఇంటర్ స్కూల్ చాంపియన్ గా నిలబెడతాను అని చాలెంజ్ చేస్తాడు. అక్కడే ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న అంజలి (స్వాతి) సంపత్ ఫై ప్రేమ పెంచుకుని అతనికి సపోర్ట్ చేస్తుంది. ఇక వివిధ నేపధ్యాలనుండి వచ్చిన 11మంది స్కూల్ పిల్లలు క్రికెట్ ను సరదాగా ఆడుతూ ఉంటారు. ఆ సరదా క్రికెట్ ను సీరియస్ గా మారుస్తాడు సంపత్, అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువే ముఖ్యం ఆటలు కాదు అని వాదిస్తే.. ఆటలవల్ల మానసికోల్లాసం వస్తుంది దాంతో చదువులో కూడా రాణిస్తారు అని చేసిచూపించి గోల్కొండ హైస్కూల్ టీం ను టోర్నమెంట్ కు సిద్ధం చేస్తాడు. ఆ ఫై వాళ్ళు చాంపియన్ షిప్ ను గెలిచి స్కూల్ గ్రౌండ్ ను ఎలా కాపాడుకున్నారు అన్నది మిగతా కధ.
విశ్లేషణ:
దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మంచి ప్రయత్నమే చేసాడు కానీ కధను నడిపించిన విధానమే నెమ్మదిగా ఉండి ఆలోచింప చేసేదిగా, వినోదాన్ని పంచేదిగా లేదు. కార్పోరేట్ విద్యతో నలిగిపోతున్న పసి మనసుల గురించి మాట్లాడాడే కానీ... అసలు నిజంగా జరుగుతున్న పరిణామాలను స్పష్టంగా చూపించలేదు. ఆటలు ఆడితే చదువు బాగా ఎలా చదువుతారో చెప్పిన విధానం అంగీకరించే విధంగా లేదు. ఆవకాశం ఉండి కూడా కొన్ని విషయాలను సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల సినిమాలో వినోదం తగ్గి ఒక మాములు సినిమాగా తయారైంది. ఇలాంటి ఆటల ఆధారంగా రూపొందే చిత్రాలలో భావోద్వేగాలను స్పృశించే అంశాలు తప్పక ఉండాలి కానీ ఈ సినిమాలో మనసును హత్తుకునే సంఘటనలు చాల ఆరుదుగా వస్తాయి. మోహన కృష్ణ రాసిన మాటలు కూడా ఏమంత ఆకట్టుకునేట్టు లేవు. సుమంత్ హీరోగా తన పూర్వపు నాణ్యతనే కొనసాగిస్తున్నాడు. కాకపోతే రొటీన్ కధ కాదు కాబట్టి పర్వాలేదు అనిపిస్తాడు. స్వాతి బాగా నటించింది కానీ ఆమె పాత్ర ఒక పాట, నాలుగు సన్నివేశాలవరకే పరిమితం కావడం దురదృష్టం. సుబ్బరాజు మరోసారి ఓ మంచిపాత్రను దక్కించుకుని చక్కగా నటించాడు. సినిమా సినిమాకు పరిణితి సాదిస్తూ పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. తనికెళ్ళ భరణి, షఫీ, హేమ తదితరులు తమ పాత్రలకు అనుగుణంగా బాగానే నటించారు. సినిమాలో నటించిన పిల్లలందరూ ప్రతి పాత్రకు సరిగ్గా సరిపోయారు. నటన కూడా అద్భుతంగా చేసారు. వారి ఎంపికలో మాత్రం ఇంద్రగంటిని అభినందించి తీరాలి. శ్రవణ్ ఎడిటింగ్ తో పాటు మిగతా విభాగాలన్ని సినిమా మూడ్ కు తగ్గట్టుగానే ఉన్నాయి.

ragada review [రగడ రివ్యూ ]


వీరు పోట్ల అనగానే రచయితగా పరిచయం. ఆ తర్వాత దర్శకుడు అయి 'బిందాస్‌' తీసి సక్సెస్‌ చేశాడు. దాంతో స్వతహాగా నాగార్జున ఫ్యాన్‌ కావడంతో ఆ కోణంలో ఆలోచించి రగడ చిత్రాన్ని రూపొందించారు. పూర్తి మాస్‌ మసాలా ఉన్న ఈ చిత్రం వినోదాత్మకంగా సాగింది. తను చేసిన ఓ హత్యను చూసిన అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు దేవుడు (తనికెళ్ళభరణి). సడెన్‌గా పెద్దన్న (కోటశ్రీనివాసరావు) పంపాడని సుప్రీత్‌ వచ్చి భరణిని చంపేస్తాడు. మొదటి షాట్‌తోనే ఈ చిత్రం ఏ తరహానో దర్శకుడు చెప్పేశాడు. రౌడీరాజ్యంలో హీరో ఎలా డీల్‌చేశాడనేది కథ.

సత్య (నాగార్జున) కడప నుంచి సిటీకి వస్తాడు. సిటీలో ఎక్కడ గొడవలు జరిగినా దానిలో ఇన్‌వాల్వ్‌ అయి వారి భరతం పడతాడు. నచ్చితే చెరకు గడ, నచ్చకపోతే రగడ.. అనే ఫిలాసఫీతో ఉంటాడు. జీకె (దేవగిల్‌)కు ప్రదీప్‌రావత్‌ గ్యాంగ్‌కు సిటీలో వైరం. ఓ సందర్భంలో జీకెను కాపాడతాడు సత్య. దాంతో తమ గ్యాంగ్‌లో కలుపుకుంటాడు. అందుకు కోట్లరూపాయలు ఇస్తాననడంతో తనకు కావాల్సింది డబ్బే అని ఆ గ్యాంగ్‌లో చేరతాడు. ఆ గ్యాంగ్‌లో షిండే శిరీష(అనుష్క)కు దగ్గరవుతాడు. అలా చేరి ప్రదీప్ రావత్‌ గ్యాంగ్‌లో ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. దీంతో విషయం అర్థంగాక సత్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకుంటాడు. తనను ఆదరించిన తల్లిని చంపినందుకు ప్రతీకారంగా సత్య ఇవన్నీ చేస్తున్నాడని గ్రహిస్తాడు ప్రదీప్‌రావత్‌. ఆతర్వాత సత్యపై ఎలా దాడి జరిపాడు? దాన్ని కడప ఉరఫ్‌ సత్య ఎలా డీల్‌ చేసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేది కథ.

కథ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. మొదటి భాగం చాలా జోవియల్‌గా ఉంటుంది. రెండోభాగంలో కథ కాస్త సీరియస్‌గా ఉన్నా అదీ సరదాగా సాగుతుంది. పక్కామాస్‌ మసాలాతో తీసిన చిత్రమిది. పొగరు, గుండె ధైర్యంగల వ్యక్తిగా నాగ్ బాగానే చేశాడు. ఫాన్స్‌కు నచ్చేవిధంగా హావభావాలు, రాయలసీమ యాసను దర్శకడు వీరుపోట్ల చక్కగా మలిచాడు. సంభాషణలు పొందికగా రాశాడు. అనుష్క వయ్యారాలు ఒలకపోస్తూ మాస్‌ను ఆకట్టుకుంది. ఆమె స్నేహితురాలిగా వచ్చే విధానం అష్టలక్ష్మి(ప్రియమణి) సన్నివేశం బాగుంది. వీరిద్దరు ఫ్రెండ్స్‌ అనే విషయం చివర్లో సత్య బయటపెట్టడం ట్విస్ట్‌. ఇలాంటివి రెండు, మూడు ఉండటంతో సెకండాఫ్‌లో కథ రక్తికడుతుంది. బ్రాహ్మాణ యువతిగా ప్రియమణి చేసిన పద్ధతి సరదాగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులుగా ధర్మవరపు, సన, సోదరునిగా మాటకు 'నారాయణ' అంటూ సంబోధించే మాస్టర్‌ భరత్‌ సన్నివేశాలు హాస్యాన్ని పండిస్తాయి.
ఎమోషనల్‌ పాత్రల్లో ప్రదీప్‌రావత్‌, దేవ్‌గిల్‌, కోట శ్రీనిసరావు పాత్రలకు న్యాయం చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు బాగున్నాయి. 'మీసమున్న మన్మథుడా..' పాటలో ఛార్మి అలరిస్తుంది. ఒకరకంగా డాన్స్‌ను ఇరగదీసింది. కాకపోతే సాహిత్యంలో స్పష్టత లోపించింది. మిగిలిన పాటలు బాగున్నాయి. 'రగడ రగడ... అనే టైటిల్‌ సాంగ్‌ సీరియస్‌ క్లైమాక్స్‌లో రొటీన్‌ పాటలా ఉన్నా అభిమానులకోసం తీసినట్లుంది. బ్రహ్మానందం పాత్ర పాత ధోరణిలో ఉన్నా కొత్తగా ఉంటుంది. అనుష్కను డాలింగ్‌ అంటూ లైనువేసే క్రమం మాస్‌ను ఆకట్టుకుటుంది. మిగిలిన పాత్రలు కధలో వచ్చి పోతుంటాయి. సర్వేష్‌ మురారి తన కెమెరా నైపుణ్యంతో నాగ్‌ను గ్లామర్‌గా చూపాడు. సంగీతపరంగా థమన్‌ బాగానే చేసినా యాక్షన్‌లో నేపథ్య సంగీతం 'పోకిరి'ని తలపిస్తుంది. చార్మినార్‌ సెట్‌వేసి ఆర్ట్‌ప్రకాష్‌ వేసిన పాట పర్వాలేదు. ఇలా అందరి కృషితో మాస్‌మసాలాతో నాగ్‌ ముందుకు వచ్చాడు. ఇండస్ట్రీ బంద్‌ జరుగుతున్న తరుణంలో సినిమాలు రిలీజ్‌లు పెద్దగా లేకపోవడంతో "రగడ" రగడచేస్తుందేమో చూడాలి.

broker review [బ్రొకర్ రివ్యూ ]


సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ తన బహుముఖ ప్రజ్ఞను చూపిస్తూ నటుడిగా శ్రీను వాసంతి లక్ష్మి, దర్శకుడిగా అందమైన మనసులో సినిమాను రూపొందించాడు. ఇప్పుడు తను స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'బ్రోకర్' సినిమా ఈ సంవత్సరపు ఆఖరి చిత్రంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్స్ సినిమా పతాకం పై రమేష్ మద్దినేని నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ కధ, స్క్రీన్-ప్లే తో పాటు సంగీతాన్ని కూడా అందించారు. ఎమ్.వి.ఎస్. హరనాద్ మాటలను వ్రాయగా కోట శ్రీనివాసరావు, శ్రీహరి, గొల్లపూడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడిగా సక్సెస్ అయిన పట్నాయక్ నటుడిగా దర్శకుడిగా నిరూపించుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలుచేస్తూనే వున్నాడు. ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా సంచలనం సృస్థించిన 2జి స్పెక్ట్రం అనుమతులకు కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియ కారణం అని తెలుసుకుని ఆచ్చర్యపడ్డారు దేశప్రజలు. ఆ లాబియిస్ట్ లు చేసే బ్రోకరింగ్ స్వరూపస్వభావాలు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేసిన ఆర్.పి. పట్నాయక్ 'బ్రోకర్' సినిమా ఎంతవరకు సమాజానికి ఉపయోగపడే విధంగా వుందో ఈ సమీక్షలో చూద్దాం.
కధ:
గణపతి (ఆర్.పి.పట్నాయక్) ఓ పెద్ద లాబియిస్ట్ అదే జనాలు ముద్దుగా 'బ్రోకర్' అని పిలుస్తారులే . రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను తన గుప్పెట్లో ఉంచుకుని గవర్నమెంట్ పనులు చేయిస్తూ ఉంటాడు. కాంట్రాక్ట్ లు ఇప్పించడం దగ్గర నుండి కేసులు మాఫీ చేయించడం, ఆఫీసర్ లను బదిలీ చేయడం వరకు తను చేయించలేని పని అంటూవుండదు. అదే విధంగా తాను ఇప్పించిన ఓ కాంట్రాక్టర్ కట్టిన ఫ్లైఓవర్ కూలి తన కొడుకు చనిపోయినా కూడా బ్రోకరింగ్ ని వదలకుండా మోసాలు చేస్తూనే ఉంటాడు. ఆ క్రమంలోనే అతని భార్య అతనికి దూరం అవుతుంది. ఓ అవినీతి ఆఫీసర్ అయిన ధర్మతేజ (శ్రీహరి) తన తప్పు తెలుసుకుని మంచివాడిగా మారి గణపతికి ఆదర్శంగా నిలుస్తాడు. ఒక విధంగా మారటానికి అవకాశం కల్పించుకున్న గణపతి తను చేస్తూ, చేయిస్తున్న అవినీతి వల్ల ఎంత నష్టం జరుగుతుందో గ్రహిస్తాడు. దాంతో తాను ఒక్కడు మాత్రమె మారితే సరిపోదు మిగతా వాళ్ళు మారాలి అని టివి9 సహకారంతో మార్పుకు శ్రీకారం చుడతాడు. ఆ కార్యక్రమం తో గణపతి ఏ విధంగా విజయం సాధించాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ: అవసరానికి, అవకాశానికి మధ్య బ్రోకర్ అనే కాప్షన్ తోనే సినిమా కధను చెప్పేశాడు ఆర్.పి. . బ్రోకరింగ్ ఎలా ఉంటుంది దాని పరిమాణాలు ఎలా ఉంటాయి అనే అంశం మీద చర్చించే ప్రయత్నం చేసాడు. అవినీతిని అంతం చేయడానికి చట్టాలు, శాశనాలు కాదు చైతన్యంతో కూడిన మార్పు కావాలి అని, అలాగే మార్పు అనే విప్లవాన్ని సృష్టించడానికి కావలసింది ఓ చిన్న అవకాశం అనీ అంతర్లినంగా చెప్పాడు. సమాజంలో పేరుకుపోయిన అవినీతి జాడ్యాన్ని వదిలించటానికి ఓ పాజిటివ్ ఆలోచన చాలు అని మంచి ఆలోచన చేసిన ఆర్.పి. అభినందనియ్యుడు. కాకపోతే మెస్సేజ్ అంతా చివరి అరగంటలో మాత్రమే చెప్పాలనుకోవడంతో మొదటి సగంలో విషయం లేక తేలిపోయింది. క్లైమాక్స్ వరకు కధనం నెమ్మదిగా సాగుతూ దూరదర్శన్ లో వచ్చే డాక్యుమెంటరిని తలిపించింది. స్క్రీన్ ప్లే కు కాస్తా నవ్యతను జోడించి సినిమాటిక్ అంశాలతో వినోదానన్ని కూర్చి నట్టయితే సినిమా అద్భుతంగా ఉండేది. ఆర్. పి. నటుడిగా, దర్శకుడిగా కంటే కధకుదిగానే ఆకట్టుకున్నాడు. యమ్.వి.ఎస్.హరనాథ్ రావు మాటల్లో వాడి తగ్గినా పతాక సన్నివేశాల్లో పర్వాలేదనిపించాయి. సమాజంలోని అవినీతి తట్టుకోలేక దానినీ ఎదిరించలేక నిస్సహయుడిగా ప్రాణాలు కోల్పోయే స్కూల్ మాస్టారు పాత్రలో గొల్లపూడి బాగా నటించారు. కోట శ్రీనివాసరావు, శ్రీహరి తమ సహజ నటనతో సినిమాకు కాస్తా ఊరటనిచ్చారు. మయూరి పర్వాలేదనిపించిన దర్మవరం చేసిన నవ్వించే ప్రయత్నం ఆకట్టుకోలేదు. ఆర్.పి.పాటల్లో రెండు మాత్రమే గుర్తుండిపోతాయి. చైతన్యప్రసాద్ వ్రాసిన సాహిత్యం కూడా రెండు మూడు పాటల్లో నే బాగుంది. మిగితా పాత్రల్లో నటించిన నటి నటులు తమ పరిది మేర బాగానే చేసారు. రక్త చరిత్ర తరవాత రెడ్ కెమెరా తో చిత్రీకరించి పూర్తీ స్థాయి డిజిటల్ టెక్నాలజీ తో రూపొందించిన చిత్రంగా మంచి మార్కులే వేయించుకుంది బ్రోకర్ . కొసమెరుపు: ఆర్.పి.బ్రోకర్ ఓ మంచి ప్రయత్నమే కాని మంచి సినిమా కాదు అని టాక్ వినపడుతుంది. క్లైమక్స్ మాత్రమే బాగుండటంతో చివరివరకు ప్రేక్షకులను హాలులో కూర్చోబెట్టటమే పెద్ద సవాల్ ఈ సినిమా విజయానికి.

vareva review[వారెవ రివ్యూ ]


తెలుగు వారి ఆస్థాన హాస్యనటుడు బ్రహ్మానందం కుమారుడిగా అప్పుడెప్పుడో 'పల్లకిలో పెళ్ళికూతురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ చాన్నాళ్ళ తరవాత మలి ప్రయత్నంగా తన నటనతో ప్రేక్షకులచేత 'వారెవా' అనిపించుకోవటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీ మిరాకిల్స్ పతాకంఫై నిర్మితమైన 'వారెవా' చిత్రంతో మహి దర్శక నిర్మాతగా పరిచయం అయ్యాడు. గౌతమ్ కు జోడిగా శాంభవి కధానాయికగా మరిచయమవగా బ్రహ్మానందం , షాయాజీ షిండే, వేణు మాధవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్ శంకర్ సంగీతానికి కేదారినాథ్ సాహిత్యాన్ని అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహించారు. తోలి చిత్రం పరాజయం కావడంతో దాదాపు ఆరు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొడుకు కెరీర్ ను తీర్చి దిద్దే పనిలో బ్రహ్మానందం చాలా జాగ్రత్తలు తీసుకుని పక్కగా ప్లాన్ చేసి ఈ సినిమా చేపించాడు అని విడుదలకు ముందు వినిపించింది. మొదటి చిత్రం తరవాత ఇన్నేళ్ళలో దాదాపు గుర్తు కూడా లేని గౌతమ్ రీ ఎంట్రీలో ప్రేక్షకులకు ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడో ఈ సమీక్షలో చూద్దాం.
కధ: రిషి (గౌతమ్) వైజాగ్ లో సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంజనీరింగ్ లో సీట్ రావటంతో అన్న వదినలతో ఉంటూ చదువుకోటానికి హైదరాబాద్ వస్తాడు. కాలేజీ లో జాయిన్ అయ్యిన తరవాత సంధ్య (శాంభవి) పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమ అవుతుంది. సంధ్య తండ్రి పెద్ద బిజినెస్ మాన్, ఆయన రిషి మంచితనానికి ముచ్చటపడి వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకుంటాడు. దాంతో రిషి వాళ్ళ అమ్మను ఒప్పించటానికి సంధ్యను తీసుకుని వైజాగ్ వస్తాడు. అక్కడ ఓ రోజు వైజాగ్ కే పెద్ద రౌడీ అయిన భూపతి (ఆశిష్ విద్యార్ది)మనుషులు రిషిని చంపటానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం భూపతి బావ మరిదిని పొరపాటున రిషి చంపేస్తాడు . ఆ పగతో రిషిని చంపాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి రిషి భూపతి దగ్గరకు వెళ్ళి బ్రతిమాలుకుంటే నెలరోజులు టైం ఇస్తున్నా ఎక్కడైనా దాక్కో వెతికి పట్టుకు నిన్ను చంపేస్తా, నెల రోజుల్లో నిన్ను చంపలేక పొతే నిన్ను వదిలేస్తా అంటాడు. దానికి రిషి నెల ఎందుకు ఒక వారం నేను నీకు అందుబాటులోనే ఉంటా నన్నుచంపు లేదంటే వదిలేయ్ అని ఎదురు చాలెంజ్ చేస్తాడు. ఇక అక్కడి నుండి రిషి ఏ విదంగా ఆ వారం రోజులు భూపతికి దొరక్కుండా తప్పించుకుని బ్రతికి బయటపడ్డాడు అన్నది మిగతాకధ.
విశ్లేషణ:
ఈ సినిమా చూసిన తరవాత ఎవరిని ఎందుకు వారెవా.. అనాలో అర్ధం కాదు. ఎవరెట్లా వున్నా తొలుత నిందించవలసినది తొలిసారి నిర్మాణ, దర్శక బాద్యతలు నిర్వహించిన మహిని. ఎందుకంటే తనకు సాద్యమైనంత వరకు క్వింటాళ్ళ లెక్కన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. కధ పరవాలేదనిపించినా చిక్కురొక్కురు కధనం తో సినిమాని కంగాళీ చేసాడు. తోలిసగం మొత్తం రొటీన్ సన్నివేశాలతో అర్ధం పర్ధం లేకుండా గడిచి పోతుంది. రెండో సగం మద్యలో అసలు కధ మొదలవుతుంది అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోవటంతో చూడటానికి ఏమి లేకుండా పోయింది. దర్శకుడిగా మహి ఏ విభాగాన్నీ సమర్ధవంతంగా వినియోగించుకోలేక పోయాడు. సినిమాలో ఏ పాత్రని అర్ధవంతంగా తిర్చిదిద్దలేకపోయాడు. పాటలు కూడా అంతంతమాత్రం గానే ఉన్నాయి. చివరికి బ్యాక్ స్కోరు ను కూడా సరిగా పలికించలేక పోయాడు మహేష్ శంకర్. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పరవాలేదనిపించిన, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ తన స్థాయికి తగ్గట్టు లేదు. రామ్ లక్ష్మణ్ పోరాటాలు బాగానే ఉన్నాయి.హీరో గా గౌతమ్ ఆకట్టుకోలేక పోయాడు. నటనలో, డైలాగులు చెప్పటంలో ఇంక పరిణితి సాదించవలసి ఉంది. కేవలం ఫైట్స్, డాన్సులు మాత్రమే నటన కాదు అని గమనించాలి. స్టార్ కమెడియన్ కొడుకు అయ్యి ఉండి కూడా, భావోద్వేగాలను పలికించటంలో, కనీసం కామెడీ టైమింగ్ విషయం లో అన్నా పట్టు ప్రదర్శించకపోవడం విచారకరం. కొత్త అమ్మాయి శాంభవి మరో నటన రాని ముంబాయి దిగుమతి, అందం చూసి ఆనందించే వారికీ బాగానే ఉంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండి పాటలకే పరిమితమైంది. షాయాజీ షిండే, దేవన్, ఆశిష్ విద్యార్ధి తమ పాత్రలకు అనుగుణంగా బాగానే నటించారు. రఘు బాబు, బ్రహ్మానందం, వేణుమాధవ్ ల కామెడీ రొటీన్ గా ఉండి అంతగా నవ్వించదు.

appalraju review[అప్పలర్రాజు రివ్యూ ]


'శివ'తో దర్శకుడిగా పరిచయమై తెలుగు సినీలోకానికి కొత్తరకం సినిమాని పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ ఆఫై బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకుని దాదాపు 12 సంవత్సరాల పాటు హిందీ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇన్నేళ్ళతరవాత వర్మ తెలుగులో దర్సకత్వం వహించిన 'కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు ' ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రేయ నిర్మాణం బ్యానర్ ఫై కోనేరు కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో సునీల్, స్వాతి, బ్రహ్మానందం,కోట శ్రీనివాసరావు, అలీ మొదలుకుని తెలుగు సినిమా హాస్యనటులంతా నటించారు. కోటి సంగీతాన్ని సమకూర్చగా, కలువసాయి సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో వర్మ కూడా ఒక పాట వ్రాయటం విశేషం. తెలుగు సినిమా పరిశ్రమ మీద ఓ సెటైర్ గా చెబుతున్న ఈ సినిమా ప్రారంభం రోజునే ఓ పాట రూపంలో తెలుగు సినిమా దర్శకులను విమర్శించిన వర్మ పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ సంచలనానికి తెర తీసాడు. సినిమాను తక్కువకాలంలో పూర్తి చేసి సినీపరిశ్రమ కాస్ట్ కట్టింగ్ చర్చలకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యాడు. సినిమా లోని పాత్రలతో బ్రోచర్ విద్దుదల చేయడం, పాటలను వారానికి ఒక్కటి చొప్పున విడుదల చేయడం వంటి వినూత్న మైన ఆలోచనలతో ప్రచారం చేసి అప్పలరాజు సినిమాను టాక్ అఫ్ ది ఇండస్త్రి గా నిలిపాడు. విడుదలకు ముందు చేసిన హడావిడి అంత ప్రేక్షకులను దియేటర్లకు రప్పించటానికే, కానీ దియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఎంత వరుకు ఉన్నాయో.. ఈ సమీక్షలో చూద్దాం.
కధ:
అప్పలరాజు(సునీల్), అమలాపురం రంభ దియేటర్లో సినిమాలు చూస్తూ సినిమాలమీద విపరీతమైన మోజు పెంచుకుని నాయకి అనే కధను సిద్దం చేసుకుని డైరెక్టర్ అయిపోవాలని హైదరాబాద్ వచ్చి వాలిపోతాడు. ఓ ఫంక్షన్ లో పరిచయం అయిన రాఖి (రఘుబాబు) అనే సెక్స్ సినిమాల నిర్మాతకు అప్పలరాజు కధ నచ్చి సినిమా తీస్తానంటాడు. కానీ తన దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా ఫైనాన్సు చేయాలంటే సినిమాలో స్టార్ ఎవరన్న ఉండాలంటాడు రాఖి. సరిగ్గా అప్పుడే రెగ్యులర్ సినిమాలతో బోర్ కొట్టి అవార్డు సినిమా చేయాలనుకుంటున్న స్టార్ హీరోయిన్ కనిష్క(సాక్షి) కు కధ చెప్పి ఒప్పిస్తాడు అప్పలరాజు. ఆవిడ సరిపోదు స్టార్ హీరో కూడా కావాలి అని ఓ కార్పోరేట్ ఫైనాన్సు కంపెనీ అడగటం తో కనిష్క సిఫార్స్ మీద ఆ సినిమాలో నటించటానికి ఒప్పుకుంటాడు తరతరాలుగా స్టార్ల కుటుంబం నుండి వచ్చిన బాబు గారు. దురదృష్ట వశాత్తు కనిష్క, బాబుగారు మద్య గొడవ రావటంతో సినిమా ఆగిపోతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని బాబు గారి మీద ఫై చేయి సాదించాలని ఆశ పడే కె.టి. అనే మరో స్టార్ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. శ్రీశైలం అన్న (బ్రహ్మానందం) అనే మాజీ రౌడి ఈ సినిమాకు పాటలు రాస్తాను అని కండిషన్ పెట్టి ఫైనాన్సు చేస్తాడు. మొదలు పెట్టె వరకు తనకు నచ్చినట్టు సినిమా చేయాలనుకున్న అప్పలరాజు సినిమా మొదలైన తరవాత తనకు సంబంధం లేకుండా ప్రతి విషయం జరిగిపోతూ ఉండటం చూసి భాద పడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల మద్య అప్పలరాజు సినిమాను ఎలా పూర్తి చేసాడు.. చివరకి ఆ సినిమా ఏమయ్యింది అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
ఇది కామెడీ సినిమా కాదు ఓ ట్రాజీడి సినిమా అని అప్పలరాజు సినిమా మొదలుపెట్టిన వర్మ చివరికి ప్రేక్షకులను ట్రాజీడి లోనే పడేసాడు. ఎందుకంటే ఈ తరహ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. అలా అని పక్కా విమర్శానాత్మక చిత్రమూ కాదు. ఏదో సగటు సినిమాలా ఉంటుంది. సినిమాలో ఎక్కడా వర్మ మార్క్ కనిపించకపోవడం విశేషం. ప్రస్తుతం ఒక తెలుగు సినిమా తియ్యాలంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయ్ ఎలాంటి మనుషులను ఎదుర్కోవాలి వంటి అంశాలను వివరించే ప్రయత్నం చేసాడు వర్మ. పాత్రలను రూపొందించిన విధానం వాటిని పరిచయం చేసిన విధానం బాగానే ఉంది కానీ అవి కధను నడిపించటానికి ప్రవర్తించిన తీరు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మొదటి సగం కాస్త నవ్వులతో పరవాలేదనిపించినా రెండో సగం సప్పగా సాగి రొటీన్ గా ముగుస్తుంది. కోటి సంగీతంలో పాటలు, కలువసాయి సాహిత్యం సినిమా మూడ్ కు తగ్గట్టు బాగున్నాయి. సుధాకర్ ఎక్కంటి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మిగత విభాగాలు పర్వాలేదు అనిపిస్తాయి. ముఖ్యంగా డాన్సు మాస్టర్లు జానీ, గణేష్ స్వామి లు సునీల్ చేత మంచి స్టెప్పులు వేయించారు. సునీల్ సినిమా సినిమాకి పరిణితి చెందుతున్నాడు. ఒక ఒత్సాహిక సినిమా ప్రేమికుడిగా, మంచి సినిమా తియ్యాలని తపనపడే దర్శకుడిగా చక్కగా నటించాడు. పాటల్లో డాన్సులు కూడా అదరగొట్టాడు. కాకపోతే సునీల్ కు సీరియస్ నటనకంటే కామెడీ నటనే బాగుంటుంది. స్వాతికి మంచి పాత్ర దొరికింది తను సమర్ధవంతంగా వినియోగించుకుంది. శ్రీశైలంగా బ్రహ్మానందం నటన పెద్దగా ఆకట్టుకోలేదు. వేణు మాధవ్, అలీ, యం.యస్, రఘుబాబు, తనికెళ్ళ భరణి తదితరులు తమ పరిదిమేర బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్ :
రెండు మూడు పాటలు, ఆ పాటల్లో సునీల్ వేసిన స్టెప్పులు, సిని పరిశ్రమకు అనుగుణంగా రూపొందించిన పాత్రలు అవి పండించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు సంబంధించి ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే రెండోసగం, రొటీన్ క్లైమాక్స్ లతో పాటు హాస్యం పాళ్ళు కూడా తగినంత లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
కొసమెరుపు: కధ స్క్రీన్ ప్లే దర్సకత్వం అప్పలరాజు సినిమా ద్వారా వర్మ జనాలని నవ్వించలనుకున్నాడో లేక సినిమా పరిశ్రమకు సంబంధించి నిజాలు చెప్పాలనుకున్నాడో..అర్ధం కాదు. ఎందుకంటే ఈ సినిమా వాస్తవానికి ఎంత దగ్గరగా ఉందొ, కల్పితానికి అంతే దగ్గరగా ఉంది.

red roses review [ఎర్ర గులాబిలు రివ్యూ ]


'ఘర్షణ', 'ఏం మాయ చేసావే' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ 'ఎర్ర గులాబీలు' అనే థ్రిల్లర్ సినిమాతో ఈ వారం ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసాడు. మన దేశం మూవీస్ బ్యానర్ ఫై అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సమీర రెడ్డి, వీర, కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించగా సమంత ప్రత్యేక పాత్రలో నటించింది. ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే హీరోగా నటిస్తున్న కార్తిక్ ఒకప్పటి తెలుగు హీరోయిన్ మహేశ్వరి తమ్ముడు. ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా అంటోనీ ఎడిటింగ్ నిర్వహించారు. తమిళ తెలుగు భాషల్లో నిర్మితమైన ఈ సినిమా తమిళ టైటిల్ 'నడిరాత్రి కుక్కలు' అని పెట్టడం విశేషం. ఒకప్పటి కమల్, శ్రీదేవిల సూపర్ హిట్ సినిమా 'ఎర్ర గులాబీలు' టైటిల్ తప్ప పెద్దగా అంచనాలు, ప్రచారం లేకుండా విడుదలైన ఈ సినిమా విశేషలేమిటో ఈ సమీక్షలో చూద్దాం.
కధ:
ముంబై లోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన సమర్ (వీర) కు తల్లిలేదు, తండ్రి కూడా చెడు వ్యసనాలకు బానిసై ఎనిమిదేళ్ళ చిన్నకుర్రాడు అని కూడా చూడకుండా సమర్ తో లైంగిక వేదింపులకు పాల్పడతాడు. దాంతో మానసికంగా దెబ్బతింటాడు సమర్. అతని పరిస్థితిని అర్ధం చేసుకున్న పక్కింటి మీనాక్షి సమర్ తండ్రి ఫై పోలీసు కంప్లేంట్ ఇవ్వటంతో జరిగిన దాడిలో అతను ఆత్మహత్య చేసుకుచనిపోతాడు. తండ్రి లేని సమర్ ను చేరదీస్తుంది మీనాక్షి.అతను పాతజీవితం మరిచిపోవాలని అని వీర గా పేరుమారుస్తుంది. కానీ మానసిక వైకల్యం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ క్రమంలో యుక్తవయసుకు వచ్చిన వీరలోని సమర్ మీనాక్షి మీదే వ్యామోహాన్ని పెంచుకుని ఆమెను బలవంతం చేస్తాడు. అతన్ని దూరంగా ఉంచటానికి ఒకప్పటి తన ప్రేమికుడు కృష్ణను పెళ్ళి చేసుకుంటుంది. వారి తొలిరాత్రి నాడే కృష్ణను దారుణంగా హత్యచేస్తాడు సమర్. అప్పుడు జరిగిన ప్రమాదంలో మీనాక్షి ఒళ్ళు మొత్తం కాలిపోతుంది. అయినా సరే అతన్ని క్షమించి తన ఆస్తినంతా సమర్ పేరున రాసి అతని తో పాటు హైదరాబాద్ వచ్చేస్తుంది మీనాక్షి. అక్కడ ఓ పెద్ద ఎస్టేట్ లో వాళ్ళిద్దరే ఉంటూ ఉంటారు. ఆ తరవాత తనలోని పైశాచిక కామాన్ని తీర్చుకోవటానికి అమ్మాయిలను అపహరించి చంపేస్తు ఉంటాడు సమర్. అలా ఓ మూడేళ్ళు గడిచిపోతాయ్ అప్పుడు అతనికి తన స్కూల్ మేట్ సుకన్య(సమీర రెడ్డి) కనిపిస్తుంది. ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ ఆమె అర్జున్ ను ప్రేమిస్తుంది. అందుకని అర్జుని చంపి సుకన్యను కిడ్నాప్ చేస్తాడు. ఇక అక్కడి నుండి సుకన్య తప్పించుకునే క్రమంలో సమర్ కు సంబంధించి ఎన్నో ఆసక్తి కర విషయాలు బయట పడతాయి.. అవి ఏంటి అన్నదే మిగిలిన కధ.
విశ్లేషణ: గౌతమ్ వాసుదేవ మీనన్ తన స్టైలిష్ టేకింగ్ తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసాడు. సినిమాలో ఎక్కువ భయపెట్టకపోయినా అందంగా చిత్రీకరించాడు. థ్రిల్లర్ తరహాలో కధ వున్నా అంతర్లీనంగా బాలలమీద జరిగే లైంగిక వేదింపులు, వాటి ప్రభావాలు, పరిణామాలు ఎలా ఉంటాయో చర్చించాడు. సినిమా మొత్తం సమర్ పాత్రను మూలంగా చేసుకునే రూపొందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండానే సినిమా చేసాడు గౌతమ్. అంతే కాకుండా ఈ సినిమా ఎర్రగులాబీలు, అపరిచితుడు చిత్రాలను గుర్తుకు తెస్తుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు ఆయువుపట్టు, ఎంతో వైవిధ్యమైన పనితనాన్ని కనబరచాడు. అంటోనీ ఎడిటింగ్ కూడా సినిమా మూడ్ ను బాగా క్యారీ చేసింది. సినిమాకు సెంటర్ పాయింట్ అయిన సమర్ అలియాస్ వీర పాత్ర చేసిన వీర ఆ పాత్రకు తగిన న్యాయమే చేసాడు, కానీ ఆ పాత్రకు అపరిచితుడులోల స్ప్లిట్ పెర్సనాలిటీ ఉంటుంది ఆ విషయం లో అతను అంతగా రాణి౦చినట్లు అనిపించదు. సమీర రెడ్డి పాత్రకు అనుగుణంగా బాగానే చేసింది. సమంతా గెస్ట్ రోల్ చేసింది అని చెప్పి చివరి షాట్లో చూపించడం ఆమె అభిమానులను భాదపెడుతుంది. ఇక మిగతా పాత్రలు మనకు పెద్దగా పరిచయం లేనివి అందులోను సమర్ పాత్ర మినహా మిగతా ఏ పాత్రకు చెప్పుకోదగ్గ నిడివి కూడా లేదు.

ప్లస్ పాయింట్స్:
గౌతమ్ వాసుదేవ మీనన్ తన స్టైలిష్ టేకింగ్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్: నవ్యతలేని కధ, నెమ్మదిగా నడిచే కధనం, గ్రిప్ లేని మాటలు, సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్స్.
కొసమెరుపు: ఈ సినిమా ఎర్ర గులాబీలు సినిమాతో టైటిల్ లో మాత్రమే కాదు కధలో కుడా కొంత సారూప్యతను పోలి ఉంది, కానీ ఆ సినిమా అప్పటి ప్రేక్షకులను మెప్పించినట్టు ఈ ఎర్ర గులాబీలు మెప్పించడం కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

raj movie review[రాజ్ రివ్యూ ]


సంక్రాంతి పండక్కి గోల్కొండ హైస్కూల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సుమంత్ ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయాడు. ఇప్పుడేమో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన 'రాజ్' సినిమాతో వేసవికి ముందు సందడిచేయటానికి ఈ వారం ప్రేక్షకులముందుకు వచ్చాడు. కుమార్ బ్రదర్స్ సినిమా బ్యానర్ ఫై కుమార్ బ్రదర్స్, గౌటి హరినాథ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వి.యన్.ఆదిత్య దర్శకుడిగా వ్యవహరించారు. ప్రియమణి, విమలా రామన్ లు సుమంత్ తో జోడికట్టిన ఈ సినిమాలో అజయ్, అలీ, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కోటి సంగీతాన్ని అందించాడు. జగన్ సినిమాటోగ్రఫీ అందించగా కెవి కృష్ణారెడ్డి ఎడిటింగ్ నిర్వహించారు. పెద్దగా హడావిడి లేకుండా మొదలైన ఈ సినిమా సుమంత్ ప్రియమణి ల ముద్దు సన్నివేశం విషయం బయటపడటంతో కాస్త జనాలకి తెలిసింది. ఆ తరవాత దర్శకుడినీ మార్చిన అంశం చర్చనియంశమై౦ది. ఆ ఫైన హీరోకంటే కూడా హీరోయిన్ల గ్లామర్, సుమంత్ ఇద్దరు హీరోయిన్ లతో చేసిన ముద్దు సన్నివేశాలు వంటి వాటినే ప్రధానంగా చేసుకుని ప్రచారం చేసారు. కుమార్ బ్రదర్స్ గతచిత్రం 'సాద్యం'కి కూడా ప్రియమణి గ్లామర్ నే అడ్డుపెట్టుకుని ఓపెనింగ్స్ తెచ్చుకున్నారు కానీ సినిమా పరాజయం పాలైంది, మరి ఈ సినిమా పరిస్థితి ఏమిటో మన సమీక్షలో చూద్దాం. కధ: రాజ్ (సుమంత్) మైథిలి (ప్రియమణి)తో పెళ్ళి నిశ్చయం చేసుకున్న తరవాత అనుకోని పరిస్థితుల్లో ప్రియ(విమల రామన్)ను ప్రేమిస్తాడు. ఆమె నే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు, కానీ సడన్ గా ప్రియ కనిపించకుండా పోతుంది. దాంతో తండ్రి మాట కాదనలేక మైథిలి ని పెళ్ళి చేసుకుంటాడు కానీ ఆమెకు దగ్గరవ్వలేడు. కొన్నాళ్ళకి ప్రియని మర్చిపోయి మైథిలి కి దగ్గరవుతాడు. అప్పుడు ప్రియ మళ్ళి కనిపిస్తుంది. ప్రియ తనను ఎందుకు వదిలేసి వెళ్ళిందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే ఆమె చిక్కుల్లో ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఆ క్రమంలో మైథిలి రాజ్ ను అపార్ధం చేసుకుంటుంది. ఇక అక్కడి నుండి రాజ్ ఏవిదంగా ప్రియను కాపాడి, మైథిలి ఫై తనకున్న ప్రేమను నిరూపించుకున్నాడు అన్నది మిగిలిన కధ. విశ్లేషణ: సినిమాటోగ్రఫీ తప్పించి రాజ్ సినిమాలో ఏ విభాగము, ఏ అంశము మేచ్చుకోతగ్గట్టుగా కానీ, గుర్తించుకో తగ్గట్టుగా కానీ లేదు. పాత చింతకాయపచ్చడి కధతో, బోరింగ్ కధనంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తారు. దర్శకుడు వి.యన్ ఆదిత్య సినిమాఫై సరైన పట్టు ప్రదర్శించలేదు. సినిమాటోగ్రఫీ కాస్త పర్వలేదనిపిస్తుంది. ముఖ్యంగా మనాలి లో షూట్ చేసిన పాటను అందంగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు కోటి స్వరాలు ఆకట్టుకునే విధంగా లేవు. భీమవరం బుల్లోడా... పాట రీమిక్స్ కంపోజింగ్ కానీ చిత్రీకరణ కానీ ఒరిజినల్ పాట స్థాయికి చాలా దూరంగా ఉన్నాయి. ఈ సినిమాలో పర్వాలేదు అనుకునే సన్నివేశాలు కొన్నుంటే, బాగాలేదు అనుకునే సన్నివేశాలు బోలెడున్నాయి. సుమంత్ కు భిన్నకోణాల్లో నటించే అవకాశం లబించింది కానీ దర్శకత్వలేమితో నటన తేలిపోయి ఓ సాధారణ పాత్రగా మిగిలిపోయింది. ప్రియమణి తన సహజ ధోరణిలో చక్కగా నటించింది. మొదటి సగంతో పోలిస్తే రెండో సగంలో ప్రియమణి పాత్ర నిడివి తక్కువగా ఉంది. విమలా రామన్ యవ్వన ముదుసలి తనంతో కాస్త పెద్దావిడలా కనిపిస్తుంది. అలీ, శ్రీనివాస్ రెడ్డిలు చేసిన కామెడీ పెద్దగా ఆకట్టుకోలేదు. కొసమెరుపు: మొత్తం మీద రాజ్ సినిమా సినిమాకు తక్కువ సిరియల్ కు ఎక్కువ గా ఉన్నట్టు దియేటర్ దగ్గర ప్రేక్షకుల టాక్.

timmaraju review [తిమ్మరాజు రివ్యు ]


పార్ట్ టైం హీరోగా నటించే ఫుల్ టైం కామెడీ నటుడు అలీ హీరోగా ఓ వైరైటి పాత్రలో నటించిన' తిమ్మరాజు' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై పులి రత్నం, కె.యస్.యస్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలీ తో పాటు తెలుగు సినిమా ప్రధాన హస్యనటులందరూ ఈ చిత్రంలో నటించారు. వేమగిరి కధ,స్క్రీన్-ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. నందన్ రాజ్ సంగీతాన్ని అందించగా యన్.కోటేశ్వరరావు కెమెరా మాన్ గా వ్యవహరించారు. వినోదమే ప్రదానంగా వింత గెటప్ లో ఉన్న తిమ్మరాజు ను టీం లీడర్ గా చేసుకుని సినిమాలో నటించిన వాళ్ళు, సినిమా రూపకర్తలు ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించారో ఈ సమీక్ష లో చూద్దాం. కధ: రాజమండ్రి కి దగ్గరలోని ఓ గ్రామంలో ప్రజలందరిదగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయి కానీ సిగ్నల్స్ మాత్రం లేవు. అందుకని వాళ్ళు ఓ చెట్టు ఫైన ఫోన్లు వేలాడదీసి వాడుకుంటూ ఉంటారు. అదే ఊళ్ళో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు గోవింద్ అండ్ కో.. (వేణు, సుమన్ శెట్టి) చేసిన ఆకతాయి పనివల్ల ఆ చెట్టు తగలబడి పోతుంది. దాంతో ఆగ్రహించిన ఊరి జనాన్ని శాంతపరచడానికి ఊరికి సెల్ టవర్ తెసుకువస్తామని రాజమండ్రి వచ్చి మంత్రి హరిదాసు ను అడిగితే నావల్లకాదు పొమ్మంటాడు. ఏమిచేయాలో తెలియక రోడ్డుమీద ఉన్న వీళ్ళని ఓ ప్రేమజంట సాయం అడుగుతుంది. వాళ్ళ పెళ్ళి చేయడానికి సిద్దమైన గోవింద్ అండ్ కో ని పట్టుకు తంతారు వాళ్ళ తరుపు వ్యక్తులు, ఇంతకి ఆ ప్రేమజంట ఎవరంటే మినిస్టర్ హరిదాసు కూతురు, అయన యంటి అప్పలరాజు కొడుకును. దాంతో పారిపోతున్న ప్రేమజంటను కాపాడతాడు తిమ్మరాజు(అలీ).తిమ్మరాజు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ కోయగూడానికి చెందిన వ్యక్తి. ఆనాగరికంగా ఉన్న గూడెం బతుకులు మార్చడానికి టౌన్ కు వస్తాడు. ప్రేమ జంట డబ్బు ఆశ చూపడంతో వాళ్ళను కాపాడటానికి సిద్దం అవుతాడు తిమ్మరాజు, కొన్ని అనుకోని కారణాల వల్ల గోవింద్ అండ్ కో కూడా తిమ్మరాజు తో కలసి అడవికి వెళ్తారు. ఇక అక్కడి నుండి కధ కొన్ని మలుపులు తిరిగి చివరికి అందరి కోరికలు తీరటంతో కధ సుఖాంతమవుతుంది. విశ్లేషణ: 3 కధలు, 32 ఎమోషన్స్, ఓ తలనొప్పి క్లైమాక్స్.. ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే తిమ్మరాజు సినిమా. సినిమా మొదలైన తరవాత కాసేపు నవ్వు వచ్చినట్టు అనిపిస్తుంది, నవ్వుదాం అనుకునే లోపు సెంటిమెంట్ పెట్టి కొడతారు, పోనీ దాన్ని ఫీల్ అయ్యేలోపు పాటో, ఫైటో వస్తుంది ఇలా అవసరం వున్నా లేకపోయినా తనకు తెలిసిన ప్రతిఅంశాన్ని తనకు దొరికిన ఒక్క సినిమాలోనే చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు వేమగిరి. అంతే కాకుండా ఆయన ఫై టివి ప్రభావం చాల ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మరీ ముఖ్యంగా వార్తా చానళ్ళు. కాకపోతే ఆయన వాటిని అనుకరిస్తున్నారో, లేక పేరడీ చేసి విమర్సిస్తున్నారో అర్ధంకాదు. కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి విషయాల్లో పెద్దగా ప్రతిభ చూపకపోయినా మాటలు రాసే బాధ్యతను మాత్రం సమర్ధవంతంగా నిర్వర్తించాడు. చిన్న సినిమాలకు ఉన్న పరిమితుల దృష్ట్యానో లేదా మరే కారణం చేతనో కానీ సినిమాకు పనిచేసిన ఏ విభాగము ప్రతిభావంతమైన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించలేదు. తిమ్మరాజు పాత్రను 'గాడ్ మస్ట్ బి క్రేజీ' అనే సినిమా స్పూర్తితో రూపొందించినట్టు ఉన్నారు. అలీ కెరీర్లో తిమ్మరాజు పెద్ద చెప్పుకోతగ్గ పాత్రేమీ కాదు, కాకపోతే అలీ తన పరిది మేర పాత్రకు న్యాయం చేయటానికి ప్రయత్నం చేసాడు. 'గోవింద్ అండ్ కో' గా నటించిన వేణు, సుమన్ శెట్టి తదితరులు బాగా నటించారు. సినిమాలో వీరిదే కాస్త చెప్పుకోతగ్గ కామెడీ. ఎమ్.యస్, యల్.బి.శ్రీరామ్ తన పాత్రలకు అనుగుణంగా బాగానే నటించారు. వెన్నెల కిషోర్ నటన ఎబ్బెట్టుగా ఉంది. శివకృష్ణ, జీవా తదితరులు తమ పరిదిమేర నటించారు. కొసమెరుపు: ఈ చిత్రానికి తిమ్మరాజు కాదు 'తిక్కరాజు' అని టైటిల్ పెడితే కరెక్ట్ గా సరిపోతుంది అని మాట్లాడుకుంటున్నారు సినిమానుండి బయటకు వస్తున్న ప్రేక్షకులు.

kudirite kappu cofee review [కుదిరితె కప్పు కాఫీ రివ్యూ]


2010 లో విడుదలైన మూడు సినిమాలలో ఏ ఒక్కటి పెద్దగా కలసి రాకపోయినా చేతినిండా సినిమాలతో బిజిగా ఉన్న వరుణ్ సందేశ్ 2011 లో తన అదృష్టం ఎలా ఉందొ తేల్చుకోవటానికి 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి, శివ నిర్మించిన ఈ చిత్రం తో విలేజ్ లో వినాయకుడు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన రమణ సాల్వ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. వరుణ్ సరసన సుమ భట్టాచార్య హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రముఖ గేయ రచయత సీతారామశాస్త్రి కొడుకు యోగేంద్రశర్మ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అబ్బూరి రవి మాటలు అందించిన ఈ చిత్రానికి సంతోష్ రాయ్ సినిమాటోగ్రఫీ అందించగా అనిల్ ఎడిటింగ్ నిర్వహించారు. ప్రయోగాత్మకంగా కాదు ప్రేమ కధా చిత్రాలలో మాత్రమే ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారు అని తనచుట్టూ తానే గిరి గిసేసుకున్న వరుణ్ ఈ సినిమా అన్ని ప్రేమకధల్లా కాకుండా వైరైటి గా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. కొత్త వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళ కలయికతో తయారైన 'కుదిరితే కప్పు కాఫీ' ఎంత రుచిగా ఉందొ మన సమీక్షలో చూద్దాం.
కధ:
వేణు(వరుణ్ సందేశ్) హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వేణు ప్రాణ స్నేహితుడు రవి ఓ అమ్మాయి తన ప్రేమను కాదన్నదని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ సంఘటనతో ప్రేమ మీద అసహ్యాన్ని పెంచుకుని జీవితంలో ప్రేమించకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఖాళీగా ఉన్న వేణుకు తండ్రి గిరిధర్ (భీమనేని శ్రీనివాసరావు) ఓ భాద్యత అప్పగిస్తాడు. కర్ణాటక బోర్డర్ లో దక్షిణ గిరి అనే హిల్ స్టేషన్ లో వాళ్ళకి ఒక కాఫీ షాప్ ఉంటుంది. దానిని చాన్నాళ్ళ క్రితం తనకు చదువు చెప్పిన మాలతి టీచర్ కొడుకు కోడలు చనిపోతే, కాఫీ షాప్ అండగా ఉంటుందని అది మీ కొడుకు ఆస్తి అని చెప్పి ఆమెకు ఇచ్చేస్తాడు. ఆ కాఫీ షాప్ ఆధారంతో తన మనవరాలు లాస్య (సుమ భట్టాచార్య) ను చదివిస్తుంది. మాలతిటీచర్ వయసు ఫైబడటంతో కాఫీ షాప్ ను సరిగా నడపలేక అప్పుల పాలవుతుంది. అదే సమయంలో ఆ కాఫీ షాప్ గిరిధర్ ది అని తెలుసుకుని అతన్ని తీసేసుకొమంటుంది. కాఫీ షాప్ మీద అప్పు ఇచ్చిన ఆనందరావు (తనికెళ్ళ భరణి) ఆ స్థలం మీద కన్నేస్తాడు. అందుకని కాఫీషాప్ ని సక్రమంగా నడిపి మాలతిటీచర్ కష్టాలు తీర్చమని వేణు ను పంపిస్తాడు గిరిధర్. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న లాస్య ఆ కాఫీ షాప్ ను ఓ పెద్ద రిసార్ట్ చేయాలనీ కలలు కంటుంది. ఆ విధంగా అక్కడకి చేరుకుంటారు వేణు, లాస్య. వేణు చేసే మంచి పనులు చూసి అతని మీద ప్రేమ పెంచుకుంటుంది లాస్య, వేణుకేమో ప్రేమంటే పడదు. కానీ ప్రేమ మామూలుది కాదుకదా ఒకసారి మొదలైంది అంటే ఏదో రకంగా తన పంతం నేగ్గించుకుంటుంది..! అలాగే వేణు లాస్యల ప్రేమ కధ చివరికి సుఖాంతమవుతుంది.
విశ్లేషణ:
అన్ని సక్రమంగా కలిస్తేనే మంచి కాఫీ రెడీ అవుతుంది. కానీ ఈ 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో అవసరం లేనివి ఎక్కువ , అవసరం అయినవి తక్కువ అయ్యి కాఫీ సరిగ్గా కుదరలేదు. ఈ సినిమాలోని ప్రధాన విభాగాలు సమిష్టిగా కాకుండా ఎవరి టాలెంట్ ను వారు ప్రత్యేకంగా ప్రదర్శించటానికి తమ శక్తి మేర కృషి చేసారు. రొమాంటిక్ ప్రేమకధకు సరిపడా కదా వస్తువు చేతిలోఉన్న నెమ్మదిగా సాగే కధనంతో , ఫీల్ లేని ఎమోషన్స్ సినిమాను తీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు రమణ సాల్వ. పాత్రలను మలచడంలో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించలేక పోయాడు. అబ్బూరి రవి మాటలు తన స్థాయికి తగ్గట్టు లేవు, ముఖ్యంగా విత్తనం, మొక్క, చెట్టు, కాయ, పండు వంటి పదాలను పదే పదే వాడుతూ పర్యావరణం మీద తనకున్న భాద్యతను బలంగా చాటుకున్నాడు. సినిమాపరంగా పక్కనపెడితే తొలిసారి సంగీత దర్శకుడిగా పరిచయం అయిన యోగేంద్రశర్మ చక్కటి పాటలను అందించాడు. కీరవాణి, బాలు, చిత్ర పాడిన మూడు పాటలు చాల బాగున్నాయి. సీతారామశాస్త్రి సాహిత్యం కూడా పాటలకు కొత్త అందాన్ని తెచ్చింది. కాకపోతే వాటిని చిత్రీకరించిన విధానానికి పాటల్లోని భావానికి సంబంధం లేకుండా ఉంది. స్వతహాగా కెమెరా మెన్ అయిన రమణ సాల్వ, సంతోష్ రాయ్ తో కలసి కూర్గ్ కొండప్రాంతాన్ని అందంగా తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు చెప్పినట్టు వారున ఈ సినిమాలో మీసం తేసేసి , బక్కపలచగా వెరైటిగా కనిపించాడు . నటన , డైలాగ్ డెలివరీ మున్నగు అంశాలలో ఏ మాత్రమూ పరిణితి సాదించలేదు. ఈ సినిమాలో అతని పాత్రకూడా ఏమంత కొత్తగా లేదు. హీరోయిన్ గా పరిచయం అయిన సుమ భట్టాచార్య పొట్టిగా ఉన్న అందంగా ఉంది.నటన పరంగా కాస్త పర్వాలేదనిపించింది. హీరోయిన్ కు వాయిస్ ఇచ్చిన అంజలి డబ్బింగ్ చెప్పే విధానం ఎబ్బెట్టుగా ఉంది. హీరో తండ్రిగా దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు పర్వాలేదనిపించాడు. తనికెళ్ళ భరణి, శివన్నారాయణ తదితరులు తమ పరిది మేర బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్;
సినిమాను చిత్రీకరించిన లొకేషన్ కర్నాటకలోని కూర్గ్ అందాలూ, బాలు చిత్ర, కీరవాణి పాడిన పాటలు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్:
బోరింగ్ నేరేషన్ , నెమ్మదిగా సాగే కధనం, గ్రిప్ లేని ఎమోషన్స్ , వినోదం లేక పోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్
కొసమెరుపు: ఈ సినిమాలో అమృతం ఫేం శివన్నారాయణ 'ఎవరికీ చెప్పొద్దూ ' అని ఓ ఊతపదం వాడుతూ ఉంటాడు. అలాగే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి 'ఎవరికీ చెప్పొద్దూ' అని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

lokame kottaga[లోకమే కొత్తగా రివ్యూ ]


కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సాదించిన 'మొగ్గిన మనసు' సినిమాను తెలుగులోకి 'లోకమే కొత్తగా' గా రీమేక్ చేసి ఈవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నేహ మీడియా బ్యానర్ ఫై భరత్ పారేపల్లి దర్శకత్వంలో నీలంశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివాజీ, అదితి ఆగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్, కాశి విశ్వనాధ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లలిత్ సురేష్ సంగీతాన్ని సమకూర్చగా పెద్దాడ మూర్తి సాహిత్యాన్ని అందించారు. వరస పరాజయాలతో సతమతమువుతున్న దర్శకుడు భరత్ కు, హీరో శివాజీకి తక్షణమే హిట్ కావలసిన పరిస్థితి. విళ్ళిద్దరు 'లోకమే కొత్తగా ' అన్నా తమకు విజయం అందిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలను ఈ సినిమా ఎంతవరుకు నిలబెట్టిందో మన సమీక్షలో చూద్దాం.

కధ:
కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ లో పాల్గొనటం కోసం బయలుదేరిన అదితి(అదితి ఆగర్వాల్) కాలేజీ రోజులను గుర్తుచేసుకోవటంతో మొదలవుతుంది 'లోకమే కొత్తగా' సినిమా. కాలేజీ తొలినాళ్ళు అందునా యవ్వనపు పరిమళాలు... ఒక్కసారిగా లోకమంతా కొత్తగా కనపడుతుంది. కొన్ని రోజుల పరిచయం తరవాత జ్యోతి అదితికి మంచి స్నేహితురాలవుతుంది. అంతే కాకుండా ఇద్దరు సీనియర్లతో కూడా వారికీ స్నేహం కుదురుతుంది. సినియర్లు బాయ్ ఫ్రెండ్స్ తో తిరగటం చూసి జ్యోతి, అదితి కూడా బాయ్ ఫ్రెండ్స్ గురించి కలలుకంటూ ఉంటారు. తరవాత జ్యోతికి రవితో పరిచయం అవుతుంది. ఆ క్రమంలో ఊహల్లో ఉన్న అదితి ఇంగ్లీష్ లెక్చరర్(సుమన్) ను ఇష్టపడుతుంది. అది ప్రేమకాదు ఆకర్షణ అని తెలుసుకుంటుంది. ఆ తరవాత సంగీతాన్ని ప్రేమించే రాహుల్(శివాజీ) అదితినీ చూసి మనసుపడతాడు. విబిన్నంగా తన ప్రేమను తెలియజేసి అదితి మనసు గెలుచుకుంటాడు. కానీ తన చుట్టూ ఉన్న ముగ్గురు అమ్మాయిలు ప్రేమ మూలంగా ఇబ్బందులు పడటం, రవి మోసం చేశాడని జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం అదితికి ప్రేమ మీద నమ్మకాన్ని పోగొడతాయి. దాంతో రాహుల్ ను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ తరవాత తిరిగి అదితికి ప్రేమ మీద నమ్మకం కలిగి రాహుల్ ని ఎలా కలుసుకుంది అనేది మిగిలిన కధ.

విశ్లేషణ: యవ్వనపు తొలినాళ్ళలో అమ్మాయిలలో జరిగే సంఘర్షణలు వాటి పరిణామాలు, ఫలితాలు తదితర అంశాలను చర్చించే ప్రయత్నం 'లోకమే కొత్తగా'.. సినిమాలో చోటుచేసుకున్నాయి. కధ పరంగా సినిమా బాగుంది. కానీ దాన్ని చెప్పిన విధానం నిదానంగా ఉండి ప్రేక్షకులను కుర్చోపెట్టలేదు. స్క్రీన్ ప్లే ను మలిచిన విధానం అస్పష్టంగా లెక్కలేనన్ని ప్రశ్నలకు వేదికగా ఉంది. ఇంటర్ మీడియట్ చదివే పిల్లలు ఎలా ఉంటారో అనే కనీస జ్ఞానం కూడా లేకుండా సినిమా తీసారు. సినిమాలో మాటల కంటే పాటలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎందుకో వాటివల్ల ఉపయోగం ఏమిటో అర్ధంకాదు. సంగీత దర్శకుడు లలిత సురేష్ చిన్నా చితకా కాకుండా ఏకంగా రెహ్మాన్ ట్యూన్లనే కాపీ కొట్టి మరి వినిపించాడు. ఈ సినిమాకు పనిచేసిన ఏ విభాగం పని తీరు కూడా ఆకట్టుకునే విధంగా లేదు.సినిమాలో శివాజీది ప్రాదాన్యత ఉన్న ప్రాత అనే కంటే అతిధి పాత్ర అంటే బాగుంటుది. ఆ పాత్రలో కూడా ఏమంత గొప్పగా నటించలేదు శివాజీ. అదితి ఆగర్వాల్ కు మంచి పాత్ర లబించింది. నటన పరంగా పర్వాలేదనిపించింది. సుమన్, కాశి విశ్వనాధ్, వైజాగ్ ప్రసాద్ తదితరులు తమ పరిదిమేర బాగానే నటించారు. సుమన్ శెట్టి కామెడీ ఎబ్బెట్టుగా ఉంది.

కొసమెరుపు: ఈ సినిమాలో టైం అన్ని గాయాలను నయం చేస్తుంది అని అంతర్లీనంగా ఓ పాయింట్ ఉంటుంది. అలాగే మన టైం బాగుండాలి అంటే 'లోకమే కొత్తగా..' ఆడుతున్న దియేటర్ల చాయల్లోకి కూడా వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులు.